షమీ భార్య ఓవరాక్షన్: కెమెరా పగలగొట్టి.. చేతికి గాయం చేసి..

Posted By:
Mohammed Shami’s wife Hasin Jahan accused of attacking mediaperson

హైదరాబాద్: మార్చి 6వ తేదీ మొదలుకొని రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు షమీ భార్య. ఎప్పటికప్పుడు తాజా ఆరోపణలతో మీడియా ముందుకొస్తున్న ఆమె మంగళవారం మీడియాపైనే విరుచుకుపడింది. మొదటి నుంచి ప్రశాంతంగా తన ఆవేదనను వెల్లగక్కుతున్న జహాన్ హఠాత్తుగా కోపోద్రిక్తురాలైంది.

కోల్‌కతాలో పాత్రికేయులపై దాడికి పాల్పడిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ ఘటన ముంబైలోని సెయింట్ సెబాస్టియన్ స్కూల్ ప్రాంగణంలో చోటుచేసుకుంది. పాత్రికేయులపై గట్టిగా అరుస్తూ ఒక వీడియో కెమెరాను కూడా విరగొట్టింది. ఆ వెంటనే తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అంతకుముందు రోజు తనతో పాటుగా ఎందుకు షమీని వివరణ అడగట్లేదని మీడియాని ప్రశ్నించింది. మళ్లీ మీడియా ప్రశ్నలు సంధిస్తుండటంతో ఆమె ఆగ్రహానికి గురైంది. తన మొదటి భర్త గురించి వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని అడగడంతో అందరిపై చిర్రుబుర్రులాడింది.

ఒక వ్యక్తి చేతిలో ఉన్న కెమెరాను విసిరేసింది. సమాధానం చెప్పకుండా కారెక్కి వెళ్లిపోయింది. షమీకి ధోనీ, కపిల్ దేవ్ లాంటి దిగ్గజ క్రికెటర్లు మద్దతు తెలియజేయడంతో ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. అతని పాపని మిస్ అవుతున్నానంటూ ట్వీట్ కూడా చేశాడు.

Story first published: Wednesday, March 14, 2018, 13:12 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి