న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొదటి పెళ్లి గురించి దాచింది: భార్య హసిన్‌ జహాన్‌‌పై షమీ సంచలనం

By Nageshwara Rao
Mohammed Shami makes shocking claim about wife Hasin Jahans first marriage

హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. హసిన్‌ జహాన్‌‌‌కు మొదటి పెళ్లి అయిన సంగతిని తన వద్ద దాచిందని, తనకు పుట్టిన ఇద్దరు పిల్లలను తన చెల్లెలు పిల్లలని చెప్పి తనతో పాటు తన కుటుంబ సభ్యులను నమ్మించిందని పేర్కొన్నాడు.

షమీపై ఆరోపణలు: హసిన్ జహాన్ మాజీ భర్త ఏమన్నాడో తెలుసా?షమీపై ఆరోపణలు: హసిన్ జహాన్ మాజీ భర్త ఏమన్నాడో తెలుసా?

తాజాగా గురువారం టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో షమీ మాట్లాడుతూ 'నాతో పెళ్లి హసిన్‌ జహాన్‌‌కు రెండో పెళ్లి అన్న విషయం తెలియదు. నాతో పెళ్లి అయిన తర్వాతే నెమ్మదిగా ఆ విషయాన్ని చెప్పింది. నా భార్యకు జన్మించిన పిల్లలను చనిపోయిన తన చెల్లెలు పిల్లలని చెప్పింది. ఇప్పటికీ నా కుటుంబ కుటుంబ సభ్యులు ఇదే నిజమని నమ్ముతున్నారు' అని షమీ అన్నాడు.

ఇక, పాకిస్థాన్ యువతితో తనకు వివాహేత సంబంధాలున్నాయని చేస్తోన్న ఆరోపణల్లో కూడా నిజం లేదని షమీ చెప్పాడు. 'సెలబ్రిటీలకు అభిమానులు ఉండటం సహజం. పాకిస్థాన్‌కు చెందిన అలీస్‌బా కూడా అలాంటి అభిమానే. ఈ వ్యవహారంలోకి అనవసరంగా ఆమెను లాగి వివాదం సృష్టిస్తోంది' అని షమీ వివరించాడు.

షమీతో హసిన్‌ జహాన్‌‌కు పెళ్లి కాకముందు బీర్భుమ్‌లో నివసించే షేక్ సైఫుద్దీన్‌తో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. షమీ వివాదంపై ఇప్పటికే హసిన్‌ జహాన్‌‌ మొదటి భర్త మీడియాతో మాట్లాడాడు. 2002లో హసిన్ జహాన్‌తో తనకు పెళ్లి జరిగిందని, ఇద్దరం వెస్ట్ బెంగాల్‌లో ఉన్న బీర్భుమ్‌లోని సియురిలో నివసించే వాళ్లమని చెప్పాడు.

'మిస్ యూ బెబొ' అంటూ షమీ ట్వీట్, మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన షమీ భార్య'మిస్ యూ బెబొ' అంటూ షమీ ట్వీట్, మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన షమీ భార్య

2000లో మేమిద్దరం కలుసుకున్నామని ఆ తర్వాత రెండు సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. ఆ తర్వాత మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారని (2003, 2006) తెలిపాడు. అనంతరం సమస్యలు మొదలయ్యాయని, ఆమె ఉన్నత చదువులు చదువుకొని స్వతత్రంగా నిలబడాలని కోరుకుందని, మధ్య తరగతి కుటుంబం కావడంతో అది సాధ్యం కాదని చెప్పానని అన్నాడు.

ఇదే విడాకులకు దారి తీసిందని 2010లో తామిద్దరం విడాకులు తీసుకున్నామని సైఫుద్దీన్ తెలిపాడు. తన ఇద్దరు పిల్లలను జహాన్ వద్దే ఉండేలా కోర్టు మొదట్లో తీర్పు ఇచ్చిందని పేర్కొన్నాడు. అయితే మహమ్మద్ షమీతో పెళ్లి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు తండ్రి వద్దకే వచ్చారు. షమీతో వివాదంపై హసిన్ జహాన్ పెద్ద కుమార్తె మాట్లాడుతూ తన తల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, సెలవుల్లో తన తల్లిని కలుస్తామని తెలిపారు.

అన్నతో రేప్ చేయించబోయాడు: షమీపై మరో బాంబు పేల్చిన భార్యఅన్నతో రేప్ చేయించబోయాడు: షమీపై మరో బాంబు పేల్చిన భార్య

షేక్ సైఫుద్దీన్‌ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత హసిన్ జహాన్ తన కాళ్లపై నిలబడటంతో పాటు మోడల్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఛీర్‌లీడర్‌గా అభిమానులను అలరించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడే సమయంలో షమీ ఆమె ప్రేమలో పడటం... ఆ తర్వాత 2014లో పెళ్లి చేసుకోవడం జరిగింది.

తన భర్త చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపణలు చేయడంతో పాటు అతని కుటుంబ సభ్యులపై వేధింపులు, గృహహింసకు పాల్పడుతున్నారని కోల్‌కతా పోలీసులకు షమీ భార్య ఫిర్యాదు చేయడంతో షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులు, మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి.

Story first published: Thursday, March 15, 2018, 15:28 [IST]
Other articles published on Mar 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X