న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాస్టర్‌గా మారిన మొహమ్మద్ షమీ (వీడియో)

Mohammed Shami Gives Nicholas Pooran Hindi Lessons In Funny Video

లక్నో: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు నాలుగు నెలలుగా క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. వైరస్ నేపథ్యంలో ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బయో సెక్యూర్‌ వాతావరణం సృష్టించి అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించింది. బయో సెక్యూర్‌ వాతావరణంలో ఇప్పటికే ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు అంతర్జాతీయ మ్యాచ్ ఆడాయి. పాకిస్థాన్ కూడా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

అయితే బీసీసీఐ మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో సహా అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లను వాయిదా వేసింది. దీంతో భారత క్రికెట్ ఆటగాళ్లతో సహా ఐపీఎల్ ప్రాంఛైజీలు కూడా ఖాళీగా ఉన్నారు. అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంఛైజీ ఓ పాత వీడియోను పోస్ట్ చేసి అభిమానులను అలరించింది. పంజాబ్ తరపున ఆడుతున్న మొహమ్మద్ షమీ, నికోలస్ పూరన్ ఉన్న ఒక ఫన్నీ వీడియోని గురువారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది.

వీడియోలో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ, నికోలస్ పూరన్‌కు హిందీ నేర్పిస్తున్నాడు. షమీ విమాశ్రయంలో నడుస్తూ.. 'ఆప్ కహాన్ జా రహే హో' (మీరు ఎక్కడికి వెళుతున్నారు) అనే పదాన్ని చెబితే దాన్ని నికోలస్‌ తిరిగి చెపుతున్నాడు. చాలా సేపటి తరువాత నికోలస్‌ ఆ పదాన్ని సరిగ్గా ఉచ్చరించాడు. 'హిందీ పాఠాలకు అడుగులు. నిక్కీ ప్రా' అని వీడియోకి కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన అభిమానులు లైక్‌ కొడుతూ, షేర్‌ చేస్తున్నారు.

నికోలస్ పూరన్‌ను 2018 ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ .4.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2019లో నికోలస్ పూరన్ ఫ్రాంచైజ్ కోసం 7 మ్యాచ్‌లు ఆడి 28.00 సగటుతో 168 పరుగులు చేశాడు. మహమ్మద్ షమీని కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2018 లో రూ .4.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2019లో షమీ 14 మ్యాచ్‌ల్లో ఆడాడు. అయితే ఆశించిన మేర మాత్రం రాణించలేకపోయాడు.

మహమ్మద్ షమీ ఇటీవలే అవుట్‌ ఫీల్డ్‌లో ప్రాక్టీస్‌ సెషన్ ఆరంభించాడు. పేస్‌, స్వింగ్‌ వేసే షమీ.. తన బౌలింగ్‌కు పదునుపెట్టే పనిలో పడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలంలో ఉన్న ఫామ్‌హౌజ్‌లో షమీ ప్రాక్టీస్‌ చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత కూడా ప్రాక్టీస్ చేసినా.. అతి త్వరలోనే అతడు ట్రాక్‌లోకి వచ్చేశాడు.

గంగూలీకీ ధోనీ ఎప్పటికీ పోటీకాదు: సంగక్కరగంగూలీకీ ధోనీ ఎప్పటికీ పోటీకాదు: సంగక్కర

Story first published: Thursday, July 16, 2020, 20:18 [IST]
Other articles published on Jul 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X