న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జిమ్‌లో కసరత్తులు: స్వదేశంలో ఆస్ట్రేలియాతో పర్యటనకు షమీ సిద్ధం!

Mohammed Shami gearing up for challenges as pacer sweats out in gym ahead of Australia series

హైదరాబాద్: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్ నుంచి సెలక్టర్లు మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విశ్రాంత సమయంలో ఎక్కువ కాలాన్ని మహ్మద్ షమీ జిమ్‌లో గడిపేస్తున్నాడు. అంతేకాదు తన తదుపరి సిరిస్‌కు సన్నద్ధమవుతున్నాడు.

ఇందులో భాగంగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోని తన ట్విటర్‌‌లో అభిమానులతో పంచుకున్నాడు. "శిక్షణలో ఉన్నా. రాబోయే సవాళ్లకు సన్నద్ధమవుతున్నా" అంటూ కామెంట్ కూడా పెట్టాడు. జనవరి 14నుంచి ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరిస్‌లో తిరిగి షమీ జట్టులో చేరతాడు.

నేను టెస్ట్ కెరీర్ గురించి ఆలోచించడం మానేశా: రోహిత్ శర్మనేను టెస్ట్ కెరీర్ గురించి ఆలోచించడం మానేశా: రోహిత్ శర్మ

ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా భారత జట్టుతో మూడు వన్డేల సిరిస్ ఆడనుంది. కాగా, గతేడాది షమీ మూడు ఫార్మాట్లలో టీమిండియా తరుపున అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ కూడా సాధించాడు.

గతేడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐదు వికెట్లతో సహా 21 మ్యాచ్‌ల్లో 42 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కంటే నాలుగు వికెట్లు ఎక్కువగా తీశాడు. బౌల్ట్ 20 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు పడగొట్టాడు.

9.54కి మ్యాచ్ రద్దు.. 9 గంటలకే స్టేడియం నుంచి వెళ్లిపోయిన ఆటగాళ్లు!!9.54కి మ్యాచ్ రద్దు.. 9 గంటలకే స్టేడియం నుంచి వెళ్లిపోయిన ఆటగాళ్లు!!

2019లో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసి బౌలర్ల జాబితాలో ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, టీమిండియా తరఫున మహ్మద్ షమీ ఇప్పటివరకు 47 టెస్టులు, 73 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 175 వికెట్లు, వన్డేల్లో 136, పొట్టి ఫార్మాట్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, January 7, 2020, 12:45 [IST]
Other articles published on Jan 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X