న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బాబర్ సుదీర్ఘకాలం పాక్‌ జట్టుని నడిపించగలడు.. విజయవంతమైన కెప్టెన్‌ అవుతాడు'

Mohammed Hafeez said Confident that Babar Azam will serve Pakistan for a long time

కరాచీ: పాకిస్థాన్ కొత్త కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్‌పై ఆ దేశ మాజీలు మండిప‌డుతున్న విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ మాత్రం అతనికి మద్దతు ఇచ్చాడు. బాబర్ అజామ్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అని హఫీజ్ అన్నాడు. బాబర్ సుదీర్ఘకాలం పాక్‌ జట్టును కెప్టెన్‌గా నడిపించగలడు అని, విజయవంతమైన కెప్టెన్ల జాబితాలోనూ అతని పేరు ఉంటుందని హఫీజ్ జోస్యం చెప్పాడు. గత ఏడాది పాకిస్థాన్ వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ని తప్పించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఇటీవల వరకూ ఎవరికీ ఆ బాధ్యతలు అప్పగించలేదు. త్వరలో ఇంగ్లండ్ పర్యటన ఉండడంతో ఆజమ్‌కు కెప్టెన్సీ కట్టబెట్టారు. ఇప్పటికే టీ20 కెప్టెన్​గా ఉన్న విషయం తెలిసిందే.

సోదరికి బౌలింగ్ చేసిన దీపక్ చహర్.. చివరలో ఊహించని ట్విస్ట్ (వీడియో)!!సోదరికి బౌలింగ్ చేసిన దీపక్ చహర్.. చివరలో ఊహించని ట్విస్ట్ (వీడియో)!!

బాబ‌ర్‌పై మాజీలు గ‌రంగ‌రం:

బాబ‌ర్‌పై మాజీలు గ‌రంగ‌రం:

తాజాగా వ‌న్డే సార‌థిగా ఎన్నికైన బాబ‌ర్‌.. మాజీ కెప్టెన్‌, ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌లా ఉండాల‌నుకుంటున్నాను అని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియా సమావేశంలో బాబర్ తడబడ్డాడు, స్ప‌ష్ట‌మైన ఇంగ్లిష్ మాట్లాడ‌టానికి నేనేం తెల్లవాడిని కాదన్నాడు. వీటిపై ఆ దేశ మాజీలు షోయబ్ అక్తర్, రషీద్ లతీఫ్ పెద‌వి విరిచారు. 'సార‌థి అన్నాక అన్ని అంశాల్లో జ‌ట్టును ముందుకు న‌డిపించ‌గ‌ల‌గాలి. ఆట‌గాడిగా క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును గ‌ట్టెక్కించ‌డంతో పాటు వ్య‌క్తిత్వం, భావ వ్య‌క్తీక‌ర‌ణ‌, ఆహార్యం, ఫిట్‌నెస్ ఇలా చాలా అంశాలు ఉంటాయి. అవ‌న్నీ ప‌క్క‌న పెట్టి ఇమ్రాన్ ఖాన్‌లా అన‌డం ఏంటి' అని అక్తర్ మండిపడ్డాడు. ఇప్పటికైనా బాబర్ అజామ్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని చదవకుండా తనే సొంతంగా లక్ష్యాల గురించి మాట్లాడితే మంచిది' అని లతీఫ్ సూచించాడు.

సుదీర్ఘకాలం పాక్‌ జట్టు‌ని నడిపించగలడు:

సుదీర్ఘకాలం పాక్‌ జట్టు‌ని నడిపించగలడు:

తాజాగా మహ్మద్ హఫీజ్ మాట్లాడుతూ... 'బాబర్ అజామ్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్. ఐదేళ్ల కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. బాబర్‌కి ఉన్న టాలెంట్‌కి ఇంకా మెరుగైన స్కోర్లు చేయచ్చు. అతను నాకు సోదరుడు లాంటివాడు. నేను చూడాలనుకున్న స్థాయిలో నువ్వు ఇంకా ఆడట్లేదని అతడితో చెప్పా. నేను బాబర్ కెప్టెన్సీలో ఆడింది చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడే అతని కెప్టెన్నీ సామర్థ్యంపై ఓ అంచనాకి రావడం తొందరపాటే. అయితే బాబర్ సుదీర్ఘకాలం పాక్‌ జట్టు‌ని కెప్టెన్‌గా నడిపించగలడు. విజయవంతమైన కెప్టెన్ల జాబితాలోనూ అతని పేరు కచ్చితంగా ఉంటుంది' అని అన్నాడు.

2015లో అరంగేట్రం:

2015లో అరంగేట్రం:

2015లో పాకిస్థాన్ జట్టులోకి వచ్చిన బాబర్ అజామ్ ఇప్పటి వరకూ 26 టెస్టులాడి 45.12 సగటుతో 1,850 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 74 వన్డేల్లో 54.18 సగటుతో 3,359 పరుగులు చేసాడు. వన్డేల్లో 11 శతకాలు, 15 అర్ధ శతకాలు సాధించాడు. ఇక 38 టీ20లు ఆడి 50.72 సగటుతో 1,471 పరుగులు చేశాడు. ప్రస్తుతం బాబర్ అజామ్ వయసు 25 ఏళ్లు కాగా.. ఈ వయసులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గణాంకాలు ఇలా లేవు.

పాక్ 'విరాట్ కోహ్లీ':

పాక్ 'విరాట్ కోహ్లీ':

గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న బాబర్ అజామ్‌ని పాకిస్థాన్ అభిమానులు ముద్దుగా.. పాక్ 'విరాట్ కోహ్లీ' అని పిలుచుకుంటారు. అక్కడితో ఆగకుండా కోహ్లీని మించిపోయాడని కామెంట్లు చేస్తారు. అయితే 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న కోహ్లీతో కేవలం ఐదేళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న బాబర్‌ని పోల్చడం సరికాదని కొందరు అంటున్నారు. ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అజామ్‌ అగ్రస్థానంలో ఉండగా.. వన్డేలలో 3, టెస్టులలో 5వ స్థానంలో ఉన్నాడు.

Story first published: Wednesday, June 3, 2020, 15:14 [IST]
Other articles published on Jun 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X