న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న మహమ్మద్ సిరాజ్

Mohammad Siraj becomes the first bowler in IPL history to concede 30sixes in a seaso

ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌‌ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 157పరుగులు చేసింది. ఇక అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ ధాటిగా ఆడింది. ఇక ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్ల మహమ్మద్ సిరాజ్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్తరికార్డు మూటగట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో సిరాజ్ తొలి ఓవర్ వేయగా ఆ ఓవర్లో రాజస్థాన్ ప్లేయర్ యశస్వి జైశ్వాల్ రెండు సిక్సర్లు, 1ఫోర్ కొట్టాడు. మొత్తం ఆ ఓవర్లో 16పరుగులొచ్చాయి. ఇక ఆ ఓవర్ చివరి బంతికి సిరాజ్ సిక్సర్ ఇవ్వడం ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్‌గా సిరాజ్ తొలి స్థానంలో నిలిచాడు. ఈ సిక్సర్ ఇవ్వడంతో ఒకే సీజన్లో 30సిక్సులు ఇచ్చిన తొలి బౌలర్‌గా నిలిచాడు. తద్వారా అంతకుముందు సీఎస్కే బౌలర్ 2018సీజన్లో 29సిక్సర్లు ఇచ్చిన రికార్డును అధిగమించి అత్యంత వరస్ట్ రికార్డును సిరాజ్ తన పేరిట లిఖించుకున్నాడు.

ఇకపోతే ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన ప్లేయర్ల జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే.. తొలి స్థానంలో 2022సీజన్లో ఆర్సీబీ ప్లేయర్ సిరాజ్ 31సిక్సులు, 2022లో ఆర్సీబీ ప్లేయర్ వనిందు హసరంగా 30సిక్సులు, 2018 సీజన్లో సీఎస్కే ప్లేయర్ డ్వేన్ బ్రావో 29సిక్సులు, 2015లో ఆర్సీబీ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ 28సిక్సులు, 2022లో రాజస్థాన్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ 27సిక్సులు టాప్ 5 స్థానాల్లో ఉన్నారు. ఇకపోతే ఈ సీజన్లో మహమ్మద్ సిరాజ్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. 15మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ కేవలం 9వికెట్లు మాత్రమే తీశాడు. అతని బెస్ట్ ఫిగర్స్ 2/30గా ఉన్నాయి. 57సగటుతో 10.08ఎకానమీతో అత్యంత చెత్తగా బౌలింగ్ వేశాడు. అతని బౌలింగ్ ప్రదర్శన వల్ల ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టింది. ఇక సిరాజ్ కన్సిస్టెన్సీ స్పీడ్ మెయింటెన్ చేస్తున్నా.. బౌలింగ్లో వేరియేషన్ లేకపోవడం అతని ప్రధాన లోపంగా ఉంది.

Story first published: Friday, May 27, 2022, 22:58 [IST]
Other articles published on May 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X