న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

16 బంతుల్లో 74 పరుగులు చేసిన అఫ్గాన్ క్రికెటర్

Mohammad Shahzad Lights Up T-10 League with 16-ball 74* as Rajputs Chase 95 in 4 Overs

హైదరాబాద్: దుబాయ్ వేదికగా జరుగుతోన్న టీ10 లీగ్‌లో అఫ్గాన్ క్రికెటర్ మొహమ్మద్ షెహ్‌జాద్ రెచ్చిపోయాడు. కేవలం 16బంతుల్లో 74 పరుగులు చేసి జట్టుకు చక్కటి స్కోరును అందించాడు. దీంతో తాను ప్రాతినిధ్యం వహించిన రాజ్‌పుత్స్ జట్టు పది వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది. 95 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఓపెనర్ షెహ్‌జాద్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు.

బ్రెండన్ మెక్ కల్లమ్ కూడా 8 బంతుల్లో 21

బ్రెండన్ మెక్ కల్లమ్ కూడా 8 బంతుల్లో 21

టీ10లీగ్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు 74 చేసి రికార్డు సృష్టించాడు. మరో ఎండ్‌లో బ్యాటింగ్‌కు దిగిన బ్రెండన్ మెక్ కల్లమ్ కూడా 8 బంతుల్లో 21 పరుగులు చేసినా షెహ్‌జాద్ ఇన్నింగ్స్ ముందు తేలిపోయింది. వరుస బౌండరీలు బాదిన షెహ్‌జాద్ 6 ఫోర్లతో, 8 సిక్సులతో వీరోచితంగా ఆడి చూపించాడు. తన ఇన్నింగ్స్‌ 1, 4, 6, 4, 4, 6, 1, 6, 6, 4, 6, 4, 4, 6, 6, 6 బౌండరీలను కేవలం 17 నిమిషాల్లో ముగించాడు.

షేన్ వాట్సన్ 20 బంతుల్లో 42 మాత్రమే

షేన్ వాట్సన్ 20 బంతుల్లో 42 మాత్రమే

ప్రత్యర్థి జట్టు సింధీస్ 94/6 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది. వారిని కట్డడి చేయడంలో మునాఫ్ పటేల్ 20 పరుగుచ్చి మూడు వికెట్లు తీసి జట్టుకు బలాన్ని చేకూర్చాడు. కార్లొస్ బ్రాత్‌వైట్ మరో రెండు వికెట్లు తీయగలిగాడు. కాగా, సింధీస్ జట్టులో షేన్ వాట్సన్ 20 బంతుల్లో 42 మాత్రమే ఎక్కువ పరుగుల చేయగలిగాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోరు దాటేందుకే చాలా కష్టపడ్డారు.

మొహమ్మద్ షెహ్‌జాద్‌లు క్యాంపుకు ఆలస్యంగా

మొహమ్మద్ షెహ్‌జాద్‌లు క్యాంపుకు ఆలస్యంగా

తమ అంతర్జాతీయ షెడ్యూల్‌ తీరిక లేకుండా ఉండటంతో చెన్నై వేదికగా శిక్షణ పొందుతున్నారు. శ్రీ రామచంద్ర సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్సెస్‌లోని 36 మంది ప్లేయర్లు ఫిట్‌నెస్ మరియు ఆటలో మెలకువల గురించి శిక్షణ పొందుతున్నారని అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అఫ్గాన్ స్టార్ ప్లేయర్లైన రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ షెహ్‌జాద్‌లు అదే క్యాంపులో కొద్దిగా ఆలస్యంగా జాయిన్ అవుతారని తెలిపింది.

Story first published: Thursday, November 22, 2018, 13:47 [IST]
Other articles published on Nov 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X