న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ని హెచ్‌సీఏ మోసం చేసిందా?

ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ నామినేషన్ దాఖలు చేశాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే అజహరుద్దీన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలను సాకుగా చూపిస్తూ రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌ రెడ్డి అహజరుద్దీన్ నామినేషన్‌ని తిరస్కరించిన సంగతి తెలిసిందే.

అయితే ఫిక్సింగ్ ఆరోపణలపై 2012లో తనను ఉమ్మడి హైకోర్టు నిర్దోషిగా తేల్చిందంటూ అజహరుద్దీన్ వాదించినప్పటికీ, బీసీసీఐ నుంచి ఈ విషయంలో స్పష్టత లేదని రిటర్నింగ్ అధికారి రాజీవ్ రెడ్డి పట్టించుకోలేదు. అయితే అజహరుద్దీన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక పెద్ద కుట్ర దాగుందని తాజాగా వెలుగు చూసింది.

Mohammad Azharuddin was cleared by BCCI legal cell to contest HCA elections: reports

వివరాల్లోకి వెళితే హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అజహరుద్దీన్‌కి అర్హత ఉందా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ అప్పటి అడ్‌హక్‌ కమిటీ చైర్మన్‌ ప్రకాశ్‌ చంద్‌ జైన్‌ బీసీసీఐకి ఈ మెయిల్స్‌లో రాశారు. అయితే ఆయన తనకు బీసీసీఐ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని జైన్ చెప్పడంతో రిటర్నింగ్‌ అధికారి అజహరుద్దీన్ నామినేషన్ తిరస్కరించారు.

అయితే జనవరి 12వ తేదీన బీసీసీఐ ప్రకాశ్‌ చంద్‌ జైన్‌‌కు మెయిల్‌ చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ మెయిల్‌లో 'అజహర్‌పై ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదు కాబట్టి బోర్డు న్యాయ విభాగానికి కూడా అతని విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు' అని స్పష్టంగా పేర్కొంది.

మరో ఐదు రోజుల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రకాశ్‌ చంద్‌ గానీ, రాజీవ్‌ రెడ్డి గానీ ఈ లేఖను బయట పెట్టకుండా తమకు బోర్డు నుంచి సమాచారం లేదంటూ అజహర్‌ నామినేషన్‌ను తిరస్కరించారు. అజహరుద్దీన్‌ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లోకి రాకుండా అడ్డుకునేందుకే ఈ కుట్ర జరిగినట్లు కనిపిస్తోంది.

మరోవైపు అజహర్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైన సమయంలో బీసీసీఐ కూడా ఎందుకు స్పందించలేదని ఇక్కడ అర్ధం కాని విషయం.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X