న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నువ్వు ఎదుర్కొన్న టఫ్ బ్యాట్స్‌మన్‌ ఎవరు?: మాట మార్చిన అమీర్

By Nageshwara Rao
Mohammad Amir reveals Steve Smith is toughest batsman and Sergio Aguero is his favourite footballer

హైదరాబాద్: పాకిస్థాన్ పేసర్ మొహమ్మద్ అమీర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు గతంలో ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్న సందర్భాలు అనేకం. గతేడాది ఇంగ్లాండ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తనకు ఎదురైన అత్యంత క్లిషమైన బౌలర్‌ అమిర్‌ అని కోహ్లీ చెప్పగా... వేరొక ఇంటర్యూలో తాను ఎదుర్కొన్న కఠినమైన బ్యాట్స్‌మన్‌ కోహ్లీ అని అమిర్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా క్రిక్ ఇన్ఫో అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ర్యాపిడ్ ఫైర్ ఇంటర్యూలో మొహమ్మద్ అమీర్ మాట మార్చాడు. "మీకు ఎదురైన కఠినమైన బ్యాట్స్‌మన్‌ ఎవరు?" అన్న ప్రశ్నకు గాను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌కే బౌలింగ్‌ చేయడం కష్టమని ఈ ఇంటర్యూలో సమాధానంగా చెప్పాడు.

 స్మిత్‌కు బౌలింగ్‌ చేయడం ఓ సవాల్

స్మిత్‌కు బౌలింగ్‌ చేయడం ఓ సవాల్

స్మిత్‌కు బౌలింగ్‌ చేయడమంటే ఒక సవాల్‌తో కూడుకున్నదని అమీర్‌ తెలిపాడు. ఏ కాలంలోనైనా అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు అన్న ప్రశ్నకు గాను వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాని అమీర్ ఎంపిక చేశాడు. బ్రియాన్ లారాకి బౌలింగ్ చేయడాన్ని ఎంతో గానో ఆస్వాదిస్తానని తెలిపాడు.

షాహిద్ కపూర్ హీరోగా నటిస్తే బాగుంటుంది

షాహిద్ కపూర్ హీరోగా నటిస్తే బాగుంటుంది

ఏ కాలంలోనే అత్యంత కఠినమైన బ్యాట్స్ మన్ లారానే అని ప్రశంసల వర్షం కురిపించాడు. ఒకవేళ తన జీవితాన్ని బయోపిక్‌‌గా తీస్తే అందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తే బాగుంటుందని సూచించాడు. ఇక, తనకు ఇష్టమైన పుట్‌బాల్ జట్టు అర్జెంటీనా అని, ఫేవరేట్ ప్లేయర్ మాంచెస్టర్ సిటీ స్ట్రయికర్ సెర్జియో అగురో అని చెప్పాడు.

ఏడాది పాటు నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్

ఏడాది పాటు నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్

ఈ ఏడాది మార్చిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాదిపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మోడ్రన్ డే క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా మన్ననలు అందుకుంటోన్న స్టీవ్ స్మిత్ 64 టెస్టులకు గాను 6,199 పరుగులు సాధించాడు.

టెస్టుల్లో 23 సెంచరీలు నమోదు చేసిన స్మిత్

టెస్టుల్లో 23 సెంచరీలు నమోదు చేసిన స్మిత్

ఇందులో 61.38 యావరేజితో 23 సెంచరీలు స్మిత్‌ నమోదు చేశాడు. ఇక, కోహ్లీ విషయానికి వస్తే 66 టెస్టులాడి 5, 554 పరుగులు సాధించాడు. 53కు పైగా యావరేజితో 21 సెంచరీలు నమోదు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం స్మిత్‌తో పోలిస్తే కోహ్లీదే పైచేయి. 208 వన్డేల్లో 58.11 యావరేజితో కోహ్లీ 9,588 పరుగులు చేశాడు.

వన్డేల్లో 35 సెంచరీలు బాదిన కోహ్లీ

వన్డేల్లో 35 సెంచరీలు బాదిన కోహ్లీ

ఇందులో 35 సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో 60 మ్యాచ్‌లాడిన కోహ్లీ 49.07 యావరేజితో 2,012 పరుగులు చేశాడు. అదే, స్మిత్‌ విషయానికొస్తే.. 108 వన్డేలాడి 44పైగా యావరేజితో 3,431 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 8 సెంచరీలను స్మిత్‌ సాధించాడు. టీ20ల్లో 30 మ్యాచ్‌లాడి 21.55 యావరేజ్‌తో 431 పరుగులు నమోదు చేశాడు.

ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు అమీర్ చెప్పిన జవాబులు:


ప్రశ్న: క్రికెట్‌ కాకుండా ఏ క్రీడలో ట్రోఫీ సాధించాలని అనుకుంటున్నారు?
ఆమీర్‌ జవాబు: ఫుట్‌బాల్‌


ప్రశ్న: మీ జీవితాధారంగా బయోపిక్‌ తీస్తే ఎవరు నటించాలని అనుకుంటారు?
ఆమీర్‌ జవాబు: షాహిద్‌ కపూర్


ప్రశ్న: విరామ సమయాల్లో ఏం చేస్తుంటారు?
ఆమీర్‌ జవాబు: హోటల్‌ గదిలో కూర్చుని సినిమాలు చూస్తుంటాను


ప్రశ్న: మీకు నచ్చిన క్రికెట్‌ మైదానం?
ఆమీర్‌ జవాబు: ది ఓవల్‌. ఎందుకంటే అందులో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి.


ప్రశ్న: మీకు ఏ క్రికెటర్‌ హెయిర్‌స్టైల్‌ అంటే ఇష్టం?
ఆమీర్‌ జవాబు: నాకు నా హెయిర్‌ స్టైల్‌ ఇష్టం. షాహిద్‌ అఫ్రిదిది కూడా బాగానే ఉంటుంది.


ప్రశ్న: ఓ సీనియర్‌ క్రికెటర్‌కు బౌలింగ్‌ చేసే అవకాశం వస్తే ఎవర్ని ఎంచుకుంటారు?
ఆమీర్‌ జవాబు: బ్రయాన్‌ లారా. అప్పట్లో ఆయన టఫెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌


ప్రశ్న: ఎలాంటి వర్కవుట్స్‌ మీకు బోరింగ్‌ అనిపిస్తాయి?
ఆమీర్‌ జవాబు: డెడ్‌ లిఫ్టింగ్‌


ప్రశ్న: మళ్లీ పుట్టే అవకాశం వస్తే..ఎవరిలా పుడతారు?
ఆమీర్‌ జవాబు: మహమ్మద్‌ ఆమిర్‌గానే పుడతాను


ప్రశ్న: మీరు చూసిన ఆఖరి బాలీవుడ్‌ చిత్రం?
ఆమీర్‌ జవాబు: పద్మావత్

Story first published: Friday, July 6, 2018, 16:02 [IST]
Other articles published on Jul 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X