న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ వికెట్ అలా పడగొట్టేశా: పాక్ బౌలర్

Mohammad Amir Reveals How He Dismissed Virat Kohli In Champions Trophy Final

న్యూ ఢిల్లీ: దాయాది జట్టుతో మ్యాచ్ అంటే సర్వత్రా ఉత్కంఠ. అలాంటిది ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017 టోర్నీలో ఆసాంతం ఆకట్టుకున్న టీమిండియా ఫైనల్లో పాకిస్తాన్‌ చేతిలో ఖంగుతింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు చేర్చి పాక్‌ పేసర్‌ మొహమ్మద్ అమీర్ భారత పతానాన్ని శాసించాడు. తాజాగా వాయిస్‌ ఆఫ్‌ క్రికెట్‌ షోలో ఈ పేస్‌ బౌలర్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ తీయడం వెనుకున్న తన వ్యూహం ఎంటో తెలియజేశాడు.

 కోహ్లికి అనుకూలంగా మారకూడదని నిర్ణయించుకున్నా

కోహ్లికి అనుకూలంగా మారకూడదని నిర్ణయించుకున్నా

‘రోహిత్‌ శర్మను ఔట్‌ చేయడానికి ఉపయోగించిన ఇన్‌ స్వింగ్‌ బంతినే కోహ్లికి ప్రయోగించా. కానీ అతను నా వ్యూహాన్ని పసిగట్టి చక్కగా ఆడాడు. అనంతరం కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను మా ఫీల్డర్‌ చేజార్చాడు. దీంతో ఈ అవకాశాన్ని కోహ్లికి అనుకూలంగా మారకూడదని నిర్ణయించుకున్నా. ఎలాగైనా అతని వికెట్‌ చేజిక్కుంచుకోవాలని దేవున్ని ప్రార్థించాను. మరుసటి బంతికే షాదాబ్‌ఖాన్‌ అద్భుత క్యాచ్‌తో కోహ్లి వికెట్‌ దక్కింది.'అని నాటి రోజును అమీర్‌ గుర్తు చేసుకున్నాడు.

కాంగ్రెస్‌లో జాయిన్ అయిన షమీ భార్య

 ప్రత్యేకమైన వికెట్‌ సచిన్‌దేనని

ప్రత్యేకమైన వికెట్‌ సచిన్‌దేనని

సచిన్‌ టెండూల్కర్, కోహ్లిలలో తనకు ప్రత్యేకమైన వికెట్‌ ఏదనే ప్రశ్నకు సచిన్‌దేనని అభిప్రాయపడ్డాడు. ‘ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మెన్‌. కానీ సచిన్‌ వికెటే నాకు ప్రత్యేకం. ఎందుకంటే ప్రత్యర్థిగా ఆడుతున్న సమయంలో జట్టులో సీనియర్ సచినే. అప్పుడు నేను జట్టుకు కొత్త. కాబట్టి నాకు సచిన్‌ వికెట్‌ ప్రత్యేకమే కదా'అని తెలిపాడు.

ధావన్‌, రోహిత్‌, కోహ్లిలను పెవిలియన్‌ చేర్చి

ధావన్‌, రోహిత్‌, కోహ్లిలను పెవిలియన్‌ చేర్చి

ఈ ఫైనల్లో అమీర్ భారత టాప్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలను పెవిలియన్‌ చేర్చి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఓవర్‌లోనే తన ఇన్‌స్వింగ్‌ బంతితో డు. హర్దిక్‌ పాండ్యా(76) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమవడంతో భారత్‌ 180 పరుగుల ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

వికెట్లు ముందు రోహిత్‌ను బోల్తా కొట్టించా

వికెట్లు ముందు రోహిత్‌ను బోల్తా కొట్టించా

ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 338/4 స్కోరుతో ముగించింది. పాక్ జట్టులో ఫఖార్ జమాన్ (114), మొహమ్మద్ హఫీజ్ (57) అజహర్ అలీ(59) లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ ముగ్గురిని అమీర్ కాసేపటిలో పెవిలియన్‌కు పంపించాడు. చేధనకు దిగిన టీమిండియాలో హార్దిక్ పాండ్యా ఒక్కడే (76)పరుగుల స్కోరు చేశాడు. ఈ క్రమంలో పాక్ బౌలర్లు అమీర్(3/16), హసన్ అలీ(3/19)లు 30.3ఓవర్లలో ఆల్ అవుట్ చేసి 158పరుగులకే కట్టడి చేశారు.

Story first published: Wednesday, October 17, 2018, 12:41 [IST]
Other articles published on Oct 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X