For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాంగ్రెస్‌లో జాయిన్ అయిన షమీ భార్య

Cricketer Mohammed Shami’s estranged wife Hasin Jahan joins Congress

న్యూ ఢిల్లీ: క్రికెటర్‌ మొహమ్మద్ షమీ భార్య హసీన్‌ జహాన్‌ కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం ముంబైలో ఆ ప్రాంత కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ ఆమెకు పుష్ప గుచ్ఛం అందించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వృత్తి పరంగా మోడల్‌ అయిన హసీన్‌ జహాన్‌కూ, క్రికెటర్‌ మొహమ్మద్ షమీకి 2014లో వివాహమైంది. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారు. కొద్ది నెలల క్రితం తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసి హసీన్‌ వార్తల్లో నిలిచారు.

స్క్రీన్‌షాట్లను, ఫోటోలను బయటపెట్టి

స్క్రీన్‌షాట్లను, ఫోటోలను బయటపెట్టి

భర్త తనను భౌతికంగా, మానసికంగా వేధిస్తున్నాడని, అంతేకాక అతనికి పలువురితో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను, ఫోటోలను ఆమె బయటపెట్టారు. ఆ మధ్య వివాదం బయటికి తెచ్చేందుకు తను చాటింగ్ చేసిన అమ్మాయిల మెసేజ్‌లను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టిన హసీన్ జహాన్ పట్ల ఆరంభంలో అంతా సానుభూతి వ్యక్తం చేశారు.

ధోనీ ఫిట్‌నెస్ అనుకరిస్తోన్న గారాల పట్టి జీవా(వీడియో)

ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపణలు

ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపణలు

వివాదం బయటికి వచ్చిన తర్వాత వారిద్దరూ సోషల్ మీడియా వేదికగానే చేసుకున్న చర్చలతో వారి మానసిక స్థాయి పట్ల నెటిజన్లంతా పెదవి విరిచారు. షమీ భార్య హసీన్ జహాన్ హద్దు దాటి ఏకంగా అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపణలు గుప్పించింది. నిజాలు తేల్చుకునేందుకు బీసీసీఐ న్యాయ విచారణ కమిటీ వేసి దర్యాప్తు చేపట్టింది. షమీ నిర్దోషిగా తేలడంతో బీసీసీఐ అతనిపై క్లీన్ చిట్ విడుదల చేసింది.

జహాన్ మరోసారి షమీపై కేసు నమోదు

జహాన్ మరోసారి షమీపై కేసు నమోదు

ఇక ఆ తర్వాత తనకు.. సంతానానికి పోషణ నిమిత్తం ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసీన్ జహాన్ మరోసారి షమీపై కేసు నమోదు చేసింది. దానికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకుముందు ఆమె చేసిన అప్పీలులో నెలకు రూ.10లక్షలు కావాలంటూ డిమాండ్ చేసింది.

భర్త నుంచి భరణం డిమాండ్‌

భర్త నుంచి భరణం డిమాండ్‌

ఏప్రిల్‌ 10న కోల్‌కతాలో హసీన్‌ షమీ సహా అతని కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. అప్పటి నుంచి తన భర్త నుంచి భరణం ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులపై కోల్‌కతా పోలీసులు విచారణ జరుపుతున్నారు. తనపై భార్య చేసిన ఆరోపణలను క్రికెటర్‌ షమీ ఖండించారు. షమీపై వస్తున్న వరుస ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ అతణ్ని తొలుత దూరంగా ఉంచింది. తర్వాత క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

Story first published: Wednesday, October 17, 2018, 12:13 [IST]
Other articles published on Oct 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+