న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అదే మా కొంపముంచింది.. పాకిస్థాన్ చేతిలో ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ మొయిన్ అలీ నిరాశ

Moeen Ali Explained the reasons Behind the lost to Pakistan and He Praises Rizwan Batting

లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన అయిదో టీ20లో ఇంగ్లాండ్ 6 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. స్టాండ్ ఇన్ కెప్టెన్ మొయిన్ అలీ కడవరకు క్రీజులో ఉన్నప్పటికీ.. టీంను గెలిపించలేకపోయాడు. ఇక తమ జట్టు బ్యాటింగ్‌ పట్ల మొయిన్ అలీ నిరాశ వ్యక్తం చేశాడు. ఇకపోతే 146పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు ఏడు వికెట్ల కోల్పోయి కేవలం 139పరుగులకే పరిమితమైంది.

చివరి ఓవర్‌లో 15పరుగులు అవసరం కాగా... బౌలర్ అమీర్ జమాల్ కేవలం 8పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ పాక్ వశం చేశాడు. ఈ విజయంతో పాకిస్థాన్ సిరీస్‌లో 3-2ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్‌లో దాదాపు 60-70పరుగుల భాగస్వామ్యం దక్కి ఉంటే మ్యాచ్ ఈజీగా గెలిచేవాళ్లమని మొయిన్ అన్నాడు.

అన్ని మ్యాచ్‌లతో పోలిస్తే చెత్త బ్యాటింగ్

అన్ని మ్యాచ్‌లతో పోలిస్తే చెత్త బ్యాటింగ్

'అన్ని మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్లో మేము చేసిన బ్యాటింగ్ చేసిన విధానం బాగా నిరాశపరిచింది. మేము అటాకింగ్ బ్రాండ్ క్రికెట్‌ను ఆడాలనుకున్నాం. అయితే ఆట పరిస్థితిని కూడా మనం అంచనా వేయాల్సి ఉంటుంది. ఈరోజు జట్టుకు కావాల్సింది హిట్టింగ్ కాదు. మంచి భాగస్వామ్యం మాత్రమే. మా జట్టులో ఏ ఇద్దరు బ్యాటర్లు 60 నుంచి 70పరుగుల భాగస్వామ్యాన్ని అందించినా.. మేము మ్యాచ్ గెలిచి ఉండేవాళ్లం' అని మొయిన్ అలీ మ్యాచ్ తర్వాత ప్రెస్‌ మీట్‌లో చెప్పాడు.

రిజ్వాన్ నుంచి చాలా నేర్చుకోవచ్చు

రిజ్వాన్ నుంచి చాలా నేర్చుకోవచ్చు

ఇకపోతే మొయిన్ అలీ పాక్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్‌పై ప్రశంసలు కురిపించాడు. పాకిస్తానీ ఓపెనింగ్ బ్యాటర్ నుంచి చాలా నేర్చుకోవాలని తెలిపాడు. రిజ్వాన్ ఇలాంటి పిచ్ కండిషన్లో కూడా 63పరుగులు చేయడం గ్రేట్ అంటూ కొనియాడాడు. ఇక ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇది రిజ్వాన్‌కి సిరీస్‌లో నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. 'రిజ్వాన్ చాలా తెలివైన ప్లేయర్. అతన్ని ఆపడం చాలా కష్టం. అతను చాలా ఫాంలో ఉన్నాడు. ఇబ్బందికరమైన పిచ్ పరిస్థితుల్లోను అతను బౌండరీలు కొట్టగలడు. అతని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అతను పరిస్థితిని చూసుకుంటూ ఆడతాడు. వికెట్‌కు అనుగుణంగా తన చర్యలను మార్చుకుంటాడు. ఎలాంటి సమయాల్లోనైనా స్వేచ్ఛగా ఆడడం రిజ్వాన్ స్పెషాలిటీ. అవసరమైనప్పుడు మాత్రమే రిస్క్ తీసుకుంటాడు. అతనికి బౌలింగ్ చేయడం మాకు చాలా కష్టంగా అనిపించింది' అని మొయిన్ అలీ అన్నాడు. సెప్టెంబర్ 30న ఆరో మ్యాచ్ జరగనుంది.

మొయిన్ అలీ పోరాడినా..

మొయిన్ అలీ పోరాడినా..

ఈ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు బౌలింగ్ కట్టుదిట్టంగా వేయడంతో పాటు వికెట్లు తీయడంతో 19ఓవర్లకే పాక్ 145పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (63 పరుగులు 46బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించడంలో పాత్ర పోషించాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, సామ్ కరన్ 2, డేవిడ్ విల్లీ 2, క్రిస్ వోక్స్ 1 వికెట్ తీసి సత్తా చాటారు. ఇక తర్వాత 146పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో డేవిడ్ మలన్ (36), మొయిన్ అలీ (51పరుగులు 37బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు నాటౌట్) పోరాడినా విజయానికి ఆరు పరుగుల దూరంలో ఇంగ్లాండ్ నిలిచిపోయింది.

Story first published: Thursday, September 29, 2022, 14:42 [IST]
Other articles published on Sep 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X