న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్లెడ్జింగ్ ఏ రేంజిలో అంటే: ఆ ఆసీస్ ప్లేయర్ నన్ను ‘ఒసామా’ అని పిలిచాడు

Moeen Ali claims an Aussie player called him Osama; CA to probe

హైదరాబాద్: స్లెడ్జింగ్ చేయడంలో ఆస్ట్రేలియా దిట్ట. మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాళ్లను మానసికంగా దెబ్బ తీసి వార్తల్లో నిలిచిన సందర్భాలు అనేకం. ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లతో మాటల యుద్ధానికి దిగి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంటారు.

<strong>రవిశాస్త్రి కోరిక: షెడ్యూల్‌లో మార్పులకు క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకారం</strong>రవిశాస్త్రి కోరిక: షెడ్యూల్‌లో మార్పులకు క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకారం

2015లో యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా ఓ ఆసీస్‌ ఆటగాడు తనపై మాటలదాడికి దిగాడని, అసభ్య పదజాలంతో దూషించాడని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ వాపోయాడు. తనని ఒసామా బిన్‌లాడెన్‌ అంటూ ఓ ఆసీస్‌ క్రికెటర్‌ పిలిచేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

ది టైమ్స్‌ ప్రసారం చేస్తున్న మొయిన్‌ అలీ ఆటో బయోగ్రఫీ సందర్భంగా మొయిన్‌ అలీ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. యాషెస్ సిరిస్‌లో భాగంగా కార్డిఫ్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఈ ఘటన జరిగినట్లు మొయిన్‌ అలీ వెల్లడించాడు.

అది నా తొలి యాషెస్‌ టెస్టు

అది నా తొలి యాషెస్‌ టెస్టు

"అది నా తొలి యాషెస్‌ టెస్టు. నా ప్రతిభ బయటపెట్టేందుకు ఉపయోగపడేది. కానీ, అక్కడ జరిగిన ఒక ఘటన నాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఒక ఆస్ట్రేలియా ఆటగాడు నన్ను ‘ఒసామా‌' అంటూ పిలిచేవాడు. అయితే మైదానంలో నేనెప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు" అని అలీ తెలిపాడు.

‘మొయిన్‌ అలీని ఒసామా' అని పిలిచావా?

‘మొయిన్‌ అలీని ఒసామా' అని పిలిచావా?

"ఆ ఆటగాడు చేసిన వ్యాఖ్యల గురించి ఒకరిద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెప్పా. ఇంగ్లాండ్ కోచ్ ట్రేవర్ బేలిస్ ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్‌ డారెన్‌ లీమన్‌తో సైతం ప్రస్తావించాడు. అప్పుడు కోచ్‌ డారెన్‌ ఆ ఆటగాడిని పిలిచి ‘మొయిన్‌ అలీని ఒసామా' అని పిలిచావా? అని ప్రశ్నించాడు. కానీ, ఆ ఆటగాడు ‘నేను అలా పిలవలేదు. కేవలం ‘పార్ట్‌టైమర్‌' అని మాత్రమే అన్నా' అంటూ అబద్ధం చెప్పాడు" అని అలీ పేర్కొన్నాడు. దీంతో ఆ మ్యాచ్ మొత్తంలో తాను కోపంగానే ఉండాల్సి వచ్చిందని అన్నాడు.

అంత పిచ్చివాడిని కాదని చెప్పా

అంత పిచ్చివాడిని కాదని చెప్పా

దీంతో ‘ఒసామా', ‘పార్ట్‌ టైమర్‌' అన్న పదాలకు తనకు తేడా తెలుసని, మరీ అంత పిచ్చివాడిని కాదని అలీ అప్పట్లో తాను చెప్పినట్లు వెల్లడించాడు. అంతేకాదు తాను సరిగానే విన్నానని ఆసీస్ కోచ్‌తో తెలిపాడు. తన అరంగేట్రం టెస్టులో మొయిన్ అలీ 5 వికెట్లు తీయడంతో పాటు 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లను దూషిస్తారు

ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లను దూషిస్తారు

2015లో జరిగిన యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలా దారుణంగా ప్రవర్తించారని అలీ చెప్పుకొచ్చాడు. "2105 వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో నా మొట్టమొదటి మ్యాచ్‌ని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడా. ప్రత్యర్ధి ఆటగాళ్ల పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాదు, దూషిస్తారు" అని అలీ తెలిపాడు.

Story first published: Saturday, September 15, 2018, 16:06 [IST]
Other articles published on Sep 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X