న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women's T20 World Cup: దీప్తిశర్మ బాగా ఆడినా.. పూనమ్‌ వల్లే భారత్ గెలిచింది: మిథాలీ

Mithali Raj says Poonams Efforts Completely Changed the Game in Womens T20 WC Opener

హైదరాబాద్: భారత లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌పై మహిళల వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో దీప్తి శర్మ అద్భుతమైన భాగస్వామ్యం అందించినా.. ఆస్ట్రేలియా స్టార్లను ఔట్‌ చేసిన పూనమ్‌ వల్లే మ్యాచ్‌ మలుపు తిరిగింది అని మిథాలీ అన్నారు. ప్రపంచకప్‌ ఆరంభ పోరులో పటిష్ఠమైన ఆస్ట్రేలియాపై గెలవడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు.

బీసీసీఐ గ్రీన్ సిగ్నల్.. ఆసియా XIలో భారత్ నుండి నలుగురు.. కెప్టెన్‌గా కోహ్లీ?!!బీసీసీఐ గ్రీన్ సిగ్నల్.. ఆసియా XIలో భారత్ నుండి నలుగురు.. కెప్టెన్‌గా కోహ్లీ?!!

కప్‌ గెలిచే అవకాశం అందరికీ ఉంది:

కప్‌ గెలిచే అవకాశం అందరికీ ఉంది:

మిథాలీ రాజ్‌ మాట్లాడుతూ... 'ఆసీస్ విజయం భారత్‌కు ఎంతో ఆత్మవిశ్వాసం అందించింది. అయితే ప్రపంచకప్‌ గెలిచే అవకాశం అందరికీ ఉంది. భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ సాగిన విధానం టోర్నీలో పోటీ ఎలా ఉందో చెప్పకనే చెప్పింది. ఐసీసీ ర్యాంకుల్లో ఏ స్థానంలో ఉన్నామనేది ముఖ్యం కాదని ఈ మ్యాచ్ నిరూపించింది. టోర్నీలో మరిన్ని రసవత్తర మ్యాచ్‌లను చూడబోతున్నాం. తొలి పోరులోనే విజయం రెండు జట్లతో దోబూచులాడింది. హర్మన్‌సేన బాగా ఆడింది' అని అన్నారు.

ఏకపక్షంగా సాగలేదు:

ఏకపక్షంగా సాగలేదు:

'హర్మన్‌సేన ఆసీస్‌ను ఓడించింది కాబట్టే టోర్నీకిది శుభారంభమని చెప్పలేం. భారత్-ఆసీస్ మధ్య సాగిన తీరూ అందుకు దోహదం చేసింది. మ్యాచ్‌ ఎక్కడా ఏకపక్షంగా సాగలేదు. ముందు భారత్‌ త్వరగా వికెట్లు చేజార్చుకుంది. ఆ తర్వాత మళ్లీ పుంజుకుని విలువైన పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా పటిష్ఠంగా కనిపించింది. అయితే ఒక్కసారిగా మిడిలార్డర్‌ కుప్పకూలడంతో మాస్క్ ఉత్కంఠగా మారింది' అని మిథాలీ పేర్కొన్నారు.

ఆమె వల్లే భారత్ గెలిచింది:

ఆమె వల్లే భారత్ గెలిచింది:

చాన్నాళ్ల నుంచి పూనమ్‌ యాదవ్ భారత్ తరపున మంచి ప్రదర్శన చేస్తోంది. ప్రస్తుతం ఆమె కీలక స్పిన్నర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆసీస్‌ మిడిలార్డర్‌ను త్వరగా పెవిలియన్ చేర్చడంతోనే భారత్‌కు విజయం చేకూరింది. జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి దీప్తి శర్మ అద్భుతమైన భాగస్వామ్యం అందించినా.. ఆస్ట్రేలియా కీలక బ్యాట్స్‌వుమన్‌ను ఔట్‌చేసిన పూనమ్‌ వల్లే మ్యాచ్‌ మలుపు తిరిగింది. మ్యాచ్ ఆమె గెలిపించింది' అని మిథాలీ చెప్పుకొచ్చారు.

ఆమెకు స్వేచ్ఛనివ్వడం:

ఆమెకు స్వేచ్ఛనివ్వడం:

'షెఫాలీ వర్మ అరంగేట్రంలోనే ఆకట్టుకుంది. మిడిలార్డర్‌ జోరు అందుకొనేందుకు ఆమె బ్యాటింగ్‌ సాయపడింది. ముక్కోణపు సిరీస్‌లోనూ చక్కని స్ట్రోక్‌ప్లేతో అలరించింది. పవర్‌ప్లే ఓవర్లలో ఆమెకు స్వేచ్ఛను ఇవ్వడం మంచింది. షెఫాలీ వల్లే 4 ఓవర్లకే భారత్‌ 40 పరుగులు చేసింది. అయితే ఛేదనలో ఆసీస్‌ వేగంగా పరుగులు చేయలేకపోయింది' అని మిథాలీ తెలిపారు.

17 పరుగుల తేడాతో విజయం:

17 పరుగుల తేడాతో విజయం:

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగడంతో.. లక్ష్య ఛేదనలో ఆసీస్ 19.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్‌వుమన్‌లలో అలిసా హీలీ (51) హాఫ్ సెంచరీ చేయగా.. ఆష్లీ గార్డనర్ (34) ఆకట్టుకుంది. భారత బౌలర్లలో పూనమ్ యాదమ్ 4, శిఖా పాండే 3 వికెట్లు తీశారు.

Story first published: Saturday, February 22, 2020, 14:48 [IST]
Other articles published on Feb 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X