న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్: టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

Mithali Rajs unbeaten ton helps India A take unassailable lead against Australia A in three-match T20 series

హైదరాబాద్: టీమిండియా వెటరన్‌ క్రికెటర్ మిథాలీరాజ్‌ (105 నాటౌట్‌; 61 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్) మరోసారి సంచలన ప్రదర్శన చేసింది. దీంతో బుధవారం ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇండియా-ఏ 28 పరుగులతో ఘన విజయం సాధించింది.

మిథాలీ మెరుపు సెంచరీ

మిథాలీ మెరుపు సెంచరీ

తాజా విజయంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0 తేడాతో భారత్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు మిథాలీ మెరుపు సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో మిథాలీ ప్రదర్శనే హైలెట్‌‌.

చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్

చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్

ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు స్మృతి మంధాన (102) పేరిట ఉంది. 31 బంతుల్లో హాఫ్‌సెంచరీ చేసిన మిథాలీ మరో 28బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది. స్మృతితో కలిసి ఓపెనర్‌గా బరిలో దిగిన మిథాలీ ఇన్నింగ్స్‌ చివరి వరకు క్రీజులో నిలిచింది.

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ హాఫ్ సెంచరీ

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ హాఫ్ సెంచరీ

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (57; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు)తో కలిసి జట్టుకు మంచి స్కోరు అందించింది. వీరిద్దరి జోడీ ఐదో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. మరోవైపు మంధాన (1), జెమిమా (5), హేమలత (2), అనుజ (0) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో తహిలా మెక్‌గ్రాత్‌ 2 వికెట్లు తీసింది.

టాప్ స్కోరర్‌గా తహిలా మెక్‌గ్రాత్‌

టాప్ స్కోరర్‌గా తహిలా మెక్‌గ్రాత్‌

అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా-ఏ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేయగలిగింది. తహిలా మెక్‌గ్రాత్‌ (47), హీథర్‌ గ్రాహమ్‌ (24) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (2/32), పూనమ్‌ యాదవ్‌ (2/29), అనుజ పాటిల్‌ (2/31) తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Story first published: Thursday, October 25, 2018, 11:50 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X