న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ తరపున రోహిత్‌ను దాటేసిన మిథాలీ

ICC Women's T20 World Cup,Ind vs Pak Mithali Raj Overtakes Rohit Sharma | Oneindia Telugu
Mithali Raj overtakes Rohit Sharma to become highest run-scorer for India in T20I format

హైదరాబాద్: వెస్టిండీస్ వేదికగా ఆడుతోన్న మిథాలీ రాజ్.. వెస్టిండీస్ జట్టుతో తలపడుతోన్న రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టింది. ఐసీసీ టీ20 ఉమెన్ వరల్డ్ కప్ 2019 నేపథ్యంలో ఆదివారం పాకిస్తాన్‌తో టీమిండియా మహిళల జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగడమే కాకుండా అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది మిథాలీరాజ్. భారత మహిళల జట్టు స్టార్ బ్యాట్స్‌వుమెన్ మిథాలీ రాజ్ టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డుని ఆదివారం రాత్రి బద్దలుకొట్టింది.

87 మ్యాచ్‌లాడిన రోహిత్ 2,207 పరుగులు

87 మ్యాచ్‌లాడిన రోహిత్ 2,207 పరుగులు

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో వెస్టిండీస్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన మిథాలీ రాజ్ (56: 47 బంతుల్లో 7ఫోర్లు).. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు 87 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 33.44 సగటుతో 2,207 పరుగులు చేశాడు.

మిథాలీ 2,232 పరుగులతో రికార్డ్‌

మిథాలీ 2,232 పరుగులతో రికార్డ్‌

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల చేసిన మిథాలీ రాజ్.. మొత్తంగా 2,232 పరుగులతో రికార్డ్‌ సృష్టించింది. దీంతో.. టీ20ల్లో భారత్ టాప్ స్కోరర్‌గా మిథాలీ రాజ్ నిలవగా.. ఆమె తర్వాతి స్థానాల్లో రోహిత్, విరాట్ కోహ్లి (2,102), సురేశ్ రైనా (1,605), మహేంద్రసింగ్ ధోని (1,487) నిలిచారు.

న్యూజిలాండ్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో

న్యూజిలాండ్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్‌మెన్‌గా న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ రికార్డుని వెస్టిండీస్‌తో చెపాక్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ బ్రేక్ చేస్తాడని ఊహించారు. కేవలం 69 పరుగులు సాధిస్తే ప్రపంచ నెం.1 అవుతాడని భావిస్తే.. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అతను రికార్డు చేధించడానికి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లలోనే అవకాశముంది.

Story first published: Monday, November 12, 2018, 14:55 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X