న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిథాలీ రాజ్ 2000: తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు

By Nageshwara Rao
Mithali Raj Becomes First Indian Woman to Scale Mount 2000 in T20Is

హైదరాబాద్: భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున రెండు వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పింది. మొత్తంగా ఈ ఘనత సాధించిన ఏడో మహిళా క్రికెటర్ కావడం విశేషం. మహిళల ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ ఈ రికార్డుని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ 33 బంతుల్లో 23 పరుగులు చేసింది. మొత్తం 74 టీ20 మ్యాచ్‌లాడిన మిథాలీ రాజ్ 2,015 పరుగులు చేసింది. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో మిథాలీ రాజ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 76 నాటౌట్. ఈ జాబితాలో ఇంగ్లాండ్ క్రికెటర్ ఎడ్‌వార్డ్స్ 2,605 పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతోంది.

2605 - Charlotte Edwards (England)
2528 - Stafanie Taylor (West Indies)
2515 - Suzie Bates (New Zealand)
2105 - Meg Lanning (Australia)
2091 - Sarah Taylor (England)
2039 - Deandra Dottin (West Indies)
2015 - Mithali Raj (India)

టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్

టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్

ఇక, భారత్ తరఫున టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో మిథాలీ రాజ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా... విరాట్ కోహ్లీ(1,983), రోహిత్ శర్మ (1,852), సురేశ్ రైనా (1,499), హర్మన్ ప్రీత్ కౌర్ (1,469), మహేంద్రసింగ్ ధోని (1,444), యువరాజ్ సింగ్ (1,177) పరుగులతో ఉన్నారు.

 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

ఇక, ఆసియాకప్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఆల్‌రౌండర్‌ అనూజ పాటిల్‌ భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లంక జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.

రాణించిన భారత బౌలర్లు

రాణించిన భారత బౌలర్లు

శ్రీలంక బ్యాట్స్ ఉమెన్‌లో హాసిని పెరీరా (46 నాటౌట్‌), ఓపెనర్‌ మెండీస్‌ (27) మాత్రమే లంక జట్టులో రెండంకెల స్కోరు దాటగలిగారు. మిగతా ఆటగాళ్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్‌‌కే చేరారు. భారత్‌ బౌలర్లు ఏక్తా బిస్త్‌ రెండు, జులన్‌ గోస్వామి, అనూజ పాటిల్‌, పూనమ్‌ యాదవ్‌కు తలో వికెట్‌ తీసుకున్నారు.

 18.5 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించిన భారత్

18.5 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించిన భారత్

అనంతరం 108 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 18.5 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. భారత బ్యాట్స్ ఉమెన్‌లో ఓపెనర్‌ స్మృతి మంధాన(12), హర్మన్‌ ప్రీత్‌ (25), వేద కృష్ణమూర్తి (29), అనూజ పాటిల్‌ (19) పరుగులతో ఫరవాలేదనిపించారు. తాజా విజయంతో భారత్ ఫైనల్‌ చేరుకునే అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంది. టోర్నీలో భాగంగా భారత్ తదుపరి మ్యాచ్‌లో శనివారం పాక్‌తో తలపడనుంది.

Story first published: Thursday, June 7, 2018, 18:19 [IST]
Other articles published on Jun 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X