న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌ వాయిదా వేయొద్దు.. నిర్వాహకులకు సమయం ఇవ్వాలి!!

Misbah-ul-Haq says T20 World Cup should not be postponed in haste

కరాచీ: ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయొద్దని అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) అధికారులను పాకిస్థాన్‌ హెడ్‌కోచ్, సెలెక్టర్‌ మిస్బా ఉల్‌ హక్‌ కోరాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుత పరిస్థితులన్నీ సద్దుమణిగితే.. టీ20 ప్రపంచకప్ టోర్నీతోనే క్రికెట్‌కు మళ్లీ ఆదరణ లభిస్తుందని చెప్పాడు. మిస్బా పాక్ తరపున 75 టెస్టులు, 125 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. ప్రస్తుతం పాక్ క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్, సెలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

<strong>సచిన్‌ సర్‌ అప్పటి నుంచే నాకు మెంటార్‌: యువ ఓపెనర్</strong>సచిన్‌ సర్‌ అప్పటి నుంచే నాకు మెంటార్‌: యువ ఓపెనర్

టీ20 ప్రపంచకప్‌ వాయిదా వేయొద్దు:

టీ20 ప్రపంచకప్‌ వాయిదా వేయొద్దు:

తాజాగా మిస్బా ఉల్‌ హక్‌ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ... 'కరోనా వైరస్‌ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రపంచకప్‌ సమయంలో 16 జట్లకు ఆతిథ్యమివ్వడం కష్టమే. అయినా టోర్నీ నిర్వహణపై నిర్ణయం తీసుకునేముందు సంబంధిత వర్గాలకు కనీసం ఒక నెల సమయం ఇవ్వాలి. ప్రతి ఒక్కరికీ టీ20 ప్రపంచకప్‌ చూడాలని ఉంటుంది. అంతర్జాతీయంగా ఒక్కసారి సాధారణ పరిస్థితులు నెలకొంటే.. ఈ టోర్నీతో క్రికెట్‌కు ఆదరణ లభిస్తుంది' అని అన్నాడు.

 క్రికెట్‌ను మెల్లిగా ఆరంభించాలి:

క్రికెట్‌ను మెల్లిగా ఆరంభించాలి:

జులైలో పాకిస్థాన్‌-ఇంగ్లాండ్‌ పర్యటనపై మిస్బా స్పందిస్తూ ఆ టోర్నీ అంత తేలిక కాదని చెప్పాడు. 'ప్రస్తుత పరిస్థితులు క్రికెట్‌కు అనుకూలంగా లేవు. అది ఆటగాళ్లతో పాటు ఎవరికీ మంచిది కాదు. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. దీంతో క్రీడలన్నీ స్తంభించిపోయి అభిమానులకు వినోదం లేకుండా పోయింది. అయినా ప్రజలు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌ను మెల్లిగా ఆరంభించాలి' అని మిస్బా పేర్కొన్నాడు. ఐసీసీ ఈ మధ్యే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కొత్త నిబంధనలకు అలవాటు పడటం అంత తేలిక కాదని, బంతికి మెరుపు తీసుకురావడానికి ఉమ్మి, చెమట లాంటివి రుద్దడం కష్టమన్నాడు.

 25-27 మందిని తీసుకెళతాం:

25-27 మందిని తీసుకెళతాం:

ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందే తమ ఆటగాళ్లకు మూడు వారాల పాటు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నట్లు పామిస్బా ఉల్‌ హక్‌ తెలిపాడు. 'ఇంగ్లాండ్‌కు వెళ్లాక క్వారెంటైన్‌ సమయంలోనూ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తా. ఈ పర్యటనకు ఒకేసారి 25-27 మంది ఆటగాళ్లను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. మధ్యలో ఎవర్నైనా రీప్లేస్‌ చేయాల్సి వస్తే అందుకు సిద్ధంమే. ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచీ అంతా ఒకే దగ్గర ఉంటాం, అలా అయితే ఎవరూ వైరస్‌ బారిన పడరు. మాజీ సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌ను సైతం ఇంగ్లాండ్‌ పర్యటనకు తీసుకెళుతున్నాం. ఇటీవల సర్ఫరాజ్‌ ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడు. అతడిని జట్టులో కలిగి ఉండటం సంతోషంగా ఉంది' అని పాక్‌ కోచ్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, May 26, 2020, 9:31 [IST]
Other articles published on May 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X