న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌ కోచ్‌ మిస్బా జీతమెంతో తెలిస్తే షాక్ అవుతారు.. టీమిండియా కోచ్ రవిశాస్త్రి కంటే?!!

Misbah-ul-Haq Had asked PCB to pay me what was paid to Mickey Arthur

కరాచి: ఇటీవలే పాకిస్థాన్‌ కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌గా ఆ దేశ మాజీ కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హక్‌ నియమించబడిన విషయం తెలిసిందే. అయితే మిస్బా రెండు పదవులు చేజిక్కించుకోవడంతో అతని వేతనం భారీ స్థాయిలో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ.. మిస్బా జీతమెంతో తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. మిస్బాకు టీమిండియా కోచ్ రవిశాస్త్రి జీతం సగానికంటే తక్కువగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ: జేపీ డుమినీ విశ్వరూపం.. 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ (వీడియో)ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ: జేపీ డుమినీ విశ్వరూపం.. 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ (వీడియో)

మాయలు చేయలేదు:

మాయలు చేయలేదు:

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో మిస్బా మాట్లాడాడు. 'కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌గా రెండు పదవులను ఎలా సాధించారని ఒకరు ప్రశ్నించగా.. 'రెండు పదవులు చేజిక్కించుకోవడం వెనుక తానేమీ మాయలు చేయలేదు' అని జవాబు ఇచ్చాడు. 'నాకు వచ్చే జీతంపై ఎప్పుడూ ఇంత కావాలని పాక్ బోర్డును అడగలేదు. గత కోచ్‌కి ఎంత ఇచ్చారో అంతే ఇవ్వమన్నా' అని మిస్బా తెలిపాడు. అయితే ఏడాదికి రూ.3.4 కోట్ల చొప్పున మూడేళ్ల వరకు మిస్బా జీతంగా తీసుకుంటున్నాడని అక్కడి ఓ న్యూస్‌ పేర్కొంది.

రవిశాస్త్రి జీతంలో సగం:

రవిశాస్త్రి జీతంలో సగం:

వివరాల ప్రకారం.. టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి కన్నా మిస్బా జీతం సగానికంటే తక్కువగా ఉంది. రవిశాస్త్రికి ప్రస్తుతం బీసీసీఐ ఏడాదికి రూ.9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌గా రెండు పదవులు నిర్వర్తిస్తున్న మిస్బా.. రవిశాస్త్రి జీతంలో సగం కంటే తక్కువ తీసుకోవడంతో విషయం తెలిసిన అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే మిస్బా కానీ, పీసీబీ కానీ అతడికి ఇచ్చే జీతంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

 పాక్‌ క్రికెట్‌ బోర్డును ఆదుకోవాలి:

పాక్‌ క్రికెట్‌ బోర్డును ఆదుకోవాలి:

మిస్బా మాట్లాడుతూ... ఏ దేశమైనా ఉగ్రదాడికి గురైన తర్వాత ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటుంది. ఎలాంటి స్థితిలో ఉన్నా.. క్రికెట్‌ను మాత్రం యథావిథిగా కొనసాగించాలి. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న పాక్‌ క్రికెట్‌ బోర్డును ఇతర దేశాలు ఆదుకోవాలి. మా దేశంలో వరుసగా క్రికెట్‌ సిరీస్‌లు జరగడానికి అన్ని జట్లు కృషి చేయాలలి. ఇది కొంచెం కష్టంగా ఉన్నా.. అందరూ అండగా నిలవాలి' అని మిస్బా కోరాడు. 'శ్రీలంక పర్యటించడం ద్వారా మాకు ఎంతో ధైర్యం వచ్చింది. సీనియర్‌ ఆటగాళ్లు ఈ పర్యటనకు దూరమైనా.. లంక బోర్డు కొత్త ఆటగాళ్లని పాకిస్థాన్‌కు పంపడం సంతోషం' అని మిస్బా చెప్పుకొచ్చాడు.

ఇదే సరైన సమయం:

ఇదే సరైన సమయం:

పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడేందుకు అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు ముందుకు రావాలి. అందుకు ఇదే సరైన సమయం అని పాక్ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నాడు. తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ పునరుద్ధరణకు ప్రపంచ క్రికెట్‌ సహకరించాలని కోరాడు. శుక్రవారం నుంచి శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానున్న సందర్భంగా సర్ఫరాజ్‌ మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.

Story first published: Friday, September 27, 2019, 14:47 [IST]
Other articles published on Sep 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X