Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరోసారి తండ్రి కాబోతున్న డివిలియర్స్.. విష్ చేసిన అనుష్క!

AB de Villiers and his wife Danielle de Villiers to have third child together

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి తండ్రికాబోతున్నాడు. ఇప్పటికే అతనికి ఓ బిడ్డ, కూతురు ఉన్నారు. డివిలియర్స్ సతీమణి డానియల్ డివిలియర్స్ త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. గర్భంతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ..'హలో బేబీ గర్ల్'అని క్యాప్షన్‌గా పేర్కొంది.

ఈ పోస్ట్‌ను చూసిన బాలీవుడ్ నటి, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ.. డివిలియర్స్ దంపతులకు విషెస్ తెలిపింది. 'చాలా మంచి వార్త.. డానియల్, ఏబీడీలకు అభినందనలు.'అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగవైరల్ అయింది. డివిలియర్స్ అభిమానులు కూడా అతనికి విషెస్ తెలియజేస్తున్నారు. అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికినా ఏబీడీ.. కేవలం టీ20 లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు.

ఇక రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ఎక్కువగా ఇంటి పట్టునే ఉంటున్న ఏబీడీ..ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతున్నాడు. టీ20 ప్రపచంకప్ నేపథ్యంలో మళ్లీ పునరాగమనం చేయాలని డివిలియర్స్ భావించగా.. అందుకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఓకే చెప్పింది. పూర్తి స్థాయి ఫిట్‌‌నెస్ ఉంటే ఏబీడీ వంటి ఆటగాడు మళ్లీ జట్టులోకి వస్తానంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. కానీ కరోనా పుణ్యమా టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందిగ్థత నెలకొంది.

View this post on Instagram

Hello baby girl 🎀🙏🏼

A post shared by Danielle de Villiers (@danielledevilliers) on

Story first published: Wednesday, July 15, 2020, 14:01 [IST]
Other articles published on Jul 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+