న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RCB:ఆ నిర్ణయం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేదు.. మా ఓటమికి కారణం అదే: ఆర్‌సీబీ కోచ్‌

Mike Hesson says Virat Kohlis Captaincy Call did not impact RCB team performance vs KKR

అబుదాబి: అబుదాబి వేదికగా సోమవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోయిన ఆర్‌సీబీ.. మూల్యం చెల్లించుకుంది. ఆర్‌సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (48; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (41; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో కేకేఆర్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ ఓటమిపై ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌ మైక్‌ హెసన్‌ స్పందించాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నిర్ణయం జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నాడు.

DC vs SRH: శివాలెత్తిన డేవిడ్ వార్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు జాగ్రత్త మరి!! (వీడియో)DC vs SRH: శివాలెత్తిన డేవిడ్ వార్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు జాగ్రత్త మరి!! (వీడియో)

ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం:

ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం:

ఐపీఎల్‌ 2021 రెండో దశ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 14వ సీజన్ అనంతరం ఆర్‌సీబీ సారథ్య బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఐపీఎల్ 2021 ఆరంభం ముందు కోహ్లీ తన నిర్ణయం ప్రకటించడం వల్ల బెంగళూరు ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే వార్తలు వినిపించాయి. మాజీలు, అభిమానులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అందరూ అనుకున్నట్లే సోమవారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచులో కోహ్లీసేన 92 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాచ్ అనంతర వర్చువల్ విలేకరుల సమావేశంలో ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌ మైక్‌ హెసన్‌ పాల్గొని జట్టు ఓటమిపై స్పందించాడు.

ఆ నిర్ణయం ప్రభావం చూపలేదు:

ఆ నిర్ణయం ప్రభావం చూపలేదు:

'విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని వీలైనంత త్వరగా బయటకు చెప్పాలని ముందే అనుకున్నాం. ఈ విషయం గురించి ప్రతి ఒక్క ఆటగాడికి ముందే తెలుసు. ముందుగా అందరితో కోహ్లీ తన నిర్ణయాన్ని చెప్పాడు. కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లో కోహ్లీ నిర్ణయం ప్రభావం చూపలేదు. బ్యాటింగ్‌లో మేం సరిగ్గా ఆడకపోవడమే మా ఓటమికి అసలు కారణం. చాలా త్వరగా వికెట్లు కోల్పోయాం. సరైన భాగస్వామ్యాలు నిర్మించలేకపోయాం. భాగస్వామ్యాలు లేకపోతే ఇన్నింగ్స్ నిర్మించలేం. ఒక్కరు క్రీజులో ఉంటే.. మెరుగైన స్కోర్ చేసే వాళ్లం' అని ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌ మైక్‌ హెసన్‌ అన్నాడు.

బ్యాటింగ్ వైఫల్యమే కారణం:

బ్యాటింగ్ వైఫల్యమే కారణం:

'ఆర్‌సీబీ జట్టు అంతే వేగంగా ఓటముల నుంచి పుంజుకుంటుందనే నమ్మకం ఉంది. ఈరోజు జట్టు కూర్పులో ఎలాంటి సమస్య లేదు. నిజం చెప్పాలంటే.. మేం టాస్‌ను తప్పుగా అర్థం చేసుకున్నాం. కేవలం 93 పరుగులు చేసే పిచ్‌ కాదు. కనీసం 150 పరుగులు చేయాల్సింది. ఆ స్కోర్‌ కూడా సరిపోదు అని నా అభిప్రాయం. మొత్తానికి బ్యాటింగ్ వైఫల్యమే ఓటమి కారణం' అని మైక్‌ హెసన్‌ చెప్పాడు. ఏబీ డివిలియర్స్‌ తమకు ముఖ్యమైన ఆటగాడు అని, అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నాడు. కేఎస్ భరత్‌ కీపింగ్ బాధ్యతలు చేపట్టేందుకు అర్హుడే అని పేర్కొన్నాడు.

ఈ ఓటమి మాకు మేలు కొలుపు లాంటిది:

ఈ ఓటమి మాకు మేలు కొలుపు లాంటిది:

ఈ ఓటమి తమకు మేలు కొలుపు లాంటిదని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. 'ఈ వికెట్‌పై మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం ఎంతో ముఖ్యం. ఆదిలోనే వికెట్‌పై తేమ అంత ప్రభావం చూపిస్తుందని మేం ఊహించలేదు. తొలుత బ్యాటింగ్‌ చేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే బ్యాటింగ్‌ ఎంచుకున్నాం. 40 పరుగుల దాకా మేం ఒక్క వికెటే కోల్పోయాం. ఆ తర్వాత 20 పరుగుల్లోనే ఐదు వికెట్లు కోల్పోయాం. ఇక అక్కడి నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకున్నాం. ఈ ఓటమి మాకు మేలు కొలుపు లాంటిది. రెండో దశలో ఆదిలోనే ఇలా జరగడం వల్ల మున్ముందు ఏయే విషయాలపై దృష్టిసారించాలో తెలిసింది. అయితే ఎలాంటి పరిస్థితులకైనా అలవాటు పడాలి' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, September 21, 2021, 21:37 [IST]
Other articles published on Sep 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X