న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'యుద్ధం గెలవాలంటే ఏమైనా చేయాలి.. కానీ అది వద్దు'

 Michael Clarke slams headline-chasing coward as war of words heats up

సిడ్నీ: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టులో చెలరేగిన బాల్ ట్యాంపరింగ్ దుమారం యావత్ క్రికెట్ ప్రపంచమంతా ఉలిక్కిపడేలా చేసింది. ఆ బాల్ టాంపరింగ్ ఉదంతానికి తనకూ ఎలాంటి సంబంధం లేదని కావాలనే తనపై బురద చల్లడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆరోపించాడు. జట్టు విజయం సాధించడానికి ఏమైనా చేయొచ్చనే మాటకు ద్వందార్థం తీస్తూ ఇలా చెప్పడం సబబు కాదని చెప్పుకొచ్చారు.

ఒకమేర వరకూ క్రమంలో ప్రత్యర్థి ఆటగాళ్లను హేళన చేయడం (స్లెడ్జింగ్), వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలతో వేధించడం తప్పుకాదన్నది క్లార్క్ వాదన. వీటి మూలంగానే ఆస్ట్రేలియా క్రికెటర్లలో మొండితనం, అహంభావం లక్షణాలుగా మారాయట. దీంతో పాటు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలకు ప్రధాన కారణం వారు అనుసరిస్తున్న విధానమేనని స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్, రచయిత గెరార్డ్ వాట్లే చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెట్‌లో దుమారం రేపాయి.

 స్మిత్, వార్నర్, సూచనలతో బంతిని మార్చడానికి

స్మిత్, వార్నర్, సూచనలతో బంతిని మార్చడానికి

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు, ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంరింగ్‌కు పాల్పడిన సంఘటన సంచలనం ఆ జట్టు ప్రతిష్టను దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో, అప్పటి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, వీరిద్దరి సూచనలతో బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించిన బాన్‌క్రాఫ్ట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సస్పెండ్ చేయడం కూడా తెలిసిందే.

 ఆసీస్ పర్యటనలో టీమిండియా ఉండడంతో

ఆసీస్ పర్యటనలో టీమిండియా ఉండడంతో

తత్ఫలితంగా అప్పటివరకూ ఆసీస్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న చీఫ్ కోచ్ డారెన్ లీమన్ తన పదవి నుంచి తప్పుకొన్నాడు. సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గేమ్స్ సదర్లాండ్, జట్టు ఫర్ఫార్మెన్స్ చీఫ్ పాట్ హోవర్డ్ సైతం నైతిక బాధ్యతగా వారి పదవులను వదులుకోక తప్పలేదు. భారత జట్టు ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరందుకున్నాయి.

క్లార్క్ అనుసరించిన విధానాల వల్లనే

క్లార్క్ అనుసరించిన విధానాల వల్లనే

ప్రముఖ రచయిత వాట్లే.. గతంలో క్లార్క్ అనుసరించిన విధానాల వల్లనే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇలా మారారని, విజయాల కోసం అడ్డదారులు తొక్కడానికి సిద్ధమవుతున్నారని విమర్శించడంతో మరోసారి అదే వాదన చర్చనీయాంశమైంది. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కూడా ఇలాంటి అభిప్రాయాలతోనే ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే, తనపై వాట్లే చేసిన ఆరోపణను క్లార్క్ తోసిపుచ్చాడు.

మైదానంలో అలా వ్యవహరించడం తప్పేమీ కాదని

మైదానంలో అలా వ్యవహరించడం తప్పేమీ కాదని

యుద్ధంలో గెలవాలంటే ప్రత్యర్థులపై కనికరం లేకుండా పోరాడాల్సిందేనని స్పష్టం చేశాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరించడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించాడు. అయితే, బాల్ ట్యాంపరింగ్ వంటి అడ్డదారులు వెతుక్కోవద్దని హెచ్చరించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యుడిగాగానీ, కెప్టెన్‌గాగానీ తాను ఎన్నడూ ట్యాంపరింగ్ వంటి క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన చర్యకు పాల్పడలేదని పేర్కొన్నాడు. అనవసరంగా ఈ వివాదంలోకి తన పేరును లాగుతున్నారని ఆరోపించాడు.

Story first published: Friday, November 30, 2018, 16:02 [IST]
Other articles published on Nov 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X