న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోండి: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ భావోద్వేగం

Michael Clarke Makes Heartfelt Appeal After Getting Skin Cancer Removed

హైదరాబాద్: తాను చర్మ క్యాన్సర్‌ బారిన పడిన విషయాన్ని గుర్తు చేస్తూ యువ క్రికెటర్లకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ సూచన చేశాడు. అంతేకాదు ఎవరూ ఎవరూ చర్మ క్యాన్సర్ బారిన పడకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశాడు.

<strong>పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు షాక్.. పాక్ టూర్‌ను బహిష్కరించిన లంక ఆటగాళ్లు!!</strong>పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు షాక్.. పాక్ టూర్‌ను బహిష్కరించిన లంక ఆటగాళ్లు!!

క్యాన్సర్‌ బారిన పడి

క్యాన్సర్‌ బారిన పడి చికిత్స చేయించుకున్న తర్వాత తన నుదుటిపై ఉన్న కుట్లకు సంబంధించిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా మైకేల్ క్లార్క్ "మరొక రోజు, నా ముఖానికి మరో చర్మ క్యాన్సర్‌ సర్జరీ జరిగింది. యువకులకు నేనిచ్చే సందేశం ఒక్కటే. సూర్యుడి నుంచి మీ శరీరాన్ని క్యాన్సర్‌ బారిన పడకుండా రక్షించుకోండి" అని కామెంట్ పెట్టాడు.

2006లో మైకేల్ క్లార్క్‌ తొలిసారి

2006లో మైకేల్ క్లార్క్‌ తొలిసారి

7న్యూస్.కామ్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్ కథనం ప్రకారం 2006లో మైకేల్ క్లార్క్‌ తొలిసారి చర్మ క్యాన్సర్‌ చికిత్స చేసుకున్నాడు. తాజాగా అతని నుదుటిపై క్యాన్సర్‌ కణుతులు రావడంతో వాటిని సర్జరీ ద్వారా వైద్యులు తొలగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేశాడు. 2010 నుంచి మైకేల్ క్లార్క్ క్యాన్సర్ కౌన్సిల్‌కు అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు.

2011లో పాంటింగ్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు

2011లో పాంటింగ్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు

2011లో రికీ పాంటింగ్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న క్లార్క్‌ ఆస్ట్రేలియా జట్టుకు 43వ టెస్టు కెప్టెన్‌గా వ్వవహారించాడు. అంతేకాదు ఆస్ట్రేలియా తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. పాంటింగ్‌కు వారసుడిగా ఆస్ట్రేలియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.

12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో 115 టెస్టులు

12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో 115 టెస్టులు

12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో 115 టెస్టులు, 245 వన్డేలతో పాటు 34 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన యాషెస్‌ సిరీస్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు మైకేల్ క్లార్క్ వీడ్కోలు పలికాడు. కాగా, రెండు నెలల క్రితం ఆస్ట్రేలియా మాజీ టెస్టు కెప్టెన్ ఇయాన్ చాపెల్ సైతం చర్మ క్యాన్సర్ చికిత్స చేసుకున్నాడు.

Story first published: Tuesday, September 10, 2019, 11:51 [IST]
Other articles published on Sep 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X