న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇషాన్ కిషన్ వల్లే కోహ్లీ ఫామ్ అందుకున్నాడు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

Michael Atherton says Ishan Kishan took pressure off Virat Kohli

లండన్‌: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ అందుకున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ ఆర్థర్‌టన్ అన్నాడు. టీమిండియా కెప్టెన్‌ సహజశైలిలో ఆడేందుకు కిషన్‌ ఇన్నింగ్స్‌ ఉపయోగపడిందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్(32 బంతుల్లో 56) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చేలరేగడం.. అతనికి అండగా కెప్టెన్ విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 73 నాటౌట్) రాణించడంతో భారత్ సునాయస విజయాన్నందుకుంది. అయితే మంగళవారం ఇదే వేదికగా మూడు టీ 20 జరగనున్న నేపథ్యంలో ఆర్టర్‌టన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యల చేశాడు.

అందుకే విఫలమయ్యారు..

అందుకే విఫలమయ్యారు..

'తొలి మ్యాచులో విరాట్‌ కోహ్లీ కాస్త ఒత్తిడికి గురయ్యాడు. ఎందుకంటే టీమిండియా దూకుడుగా పరుగులు చేస్తుందని అతను మీడియాతో చెప్పాడు. కానీ ఫస్ట్ మ్యాచ్ భారత టాపార్డర్ దారుణంగా విఫలమైంది. భారత లైనప్‌లో ఇబ్బంది ఏమిటంటే టాప్‌ ఆర్డర్‌లో ఒకే తరహా ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. దాంతో కోహ్లీ ఒత్తిడికి లోనయ్యాడు. మరింత దూకుడుగా ఆడటం అతడి సహజశైలి కాదు' అని ఆర్థర్‌టన్‌ అన్నాడు.

 కోహ్లీ హిట్టర్ కాదు..

కోహ్లీ హిట్టర్ కాదు..

'కోహ్లీ గొప్ప ఆటగాడు. చాలా వేగంగా పరుగులు చేస్తాడు. కానీ అతడు రిషభ్‌ పంత్, ఇషాన్ కిషన్‌ తరహా ఆటగాడు కాదు. వారి బ్యాటింగ్ శైలి భిన్నం. అందుకే ఆ కుర్రాడొచ్చి ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడటంతో కోహ్లీపై బరువు తొలగిపోయింది. తన సహజశైలిలో ఆడేందుకు ఉపయోగపడింది. తొలి మ్యాచులో ఔటైనప్పుడు ఆడిన షాట్‌ అతడు సాధారణంగా ఆడేది కాదు. కొత్తగా చేద్దామనుకొనే సరికి ఇబ్బంది పడ్డాడు. సంప్రదాయ షాట్లు ఆడటమే అతని శైలి. అలా ఆడినా అతడు వేగంగా పరుగులు చేయగలడు. ఇదే కోహ్లీ అసలైన ప్రదర్శన అని నా విశ్వాసం' అని ఆర్థర్‌టన్‌ తెలిపాడు.

 ఇస్మార్ట్ ఇషాన్..

ఇస్మార్ట్ ఇషాన్..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్‌ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం భారత్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి గెలిచింది. కోహ్లీ (49 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. విధ్వంసకర ఆటతో చెలరేగిన ఇషాన్‌ కిషాన్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 56)కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. విరాట్ కోహ్లీ- ఇషాన్ కిషాన్ రెండో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Story first published: Monday, March 15, 2021, 22:33 [IST]
Other articles published on Mar 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X