న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

19th Over ఎఫెక్ట్: కోహ్లీకి సలహా ఇచ్చిన నెహ్రాపై నెటిజన్ల జోకులు!

MI vs RCB: Twitter brutally roasts Ashish Nehra as he instructs Kohli to give 19th over to Pawan Negi

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రాపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి ముంబైలోని వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన ఆర్సీబీ ఏడింట ఓటమిపాలై ప్లేఆఫ్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో

పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో

అంతేకాదు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌కి ముందు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానులకు ఊరటనిచ్చింది. అయితే, సోమవారం నాటి ఓటమి మళ్లీ ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆశిష్ నెహ్రా తీసుకున్న ఓ నిర్ణయంతో మ్యాచ్ ఓడిపోయిందంటూ ఆర్సీబీ అభిమానులు మండిపడుతున్నారు.

ముంబై విజయ లక్ష్యం 172

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబై ఇండియన్స్‌ విజయానికి చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో పాండ్యా, పొలార్డ్ ఉన్నారు. దీంతో 19వ ఓవర్‌ని పేసర్ నవదీప్‌ షైనీతో వేయించాలని కోహ్లీ అనుకున్నాడు.

పవన్ నేగితో 19వ ఓవర్ వేయించాలని

అయితే, నవదీప్‌ షైనీని కాకుండా స్పిన్నర్ పవన్ నేగితో 19వ ఓవర్ వేయించాలని డగౌట్‌లో కూర్చున్న బౌలింగ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా సూచించాడు. దీంతో కోహ్లీ సైతం నవదీప్‌ షైనీని కాదని పవన్ నేగికి బంతి ఇచ్చాడు. దీంతో పవన్ నేగి వేసిన 19వ ఓవర్‌లో హార్ధిక్ పాండ్యా (0, 6, 4, 4, 6, వైడ్‌, 1)తో మొత్తం 22 పరుగులు రాబట్టుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది.

నెహ్రాపై ఆర్సీబీ అభిమానులు మండిపాటు

దీంతో ఆశిష్ నెహ్రాపై ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆశిష్‌ నెహ్రా తలచుకుంటే ఫస్ట్‌ ర్యాంక్‌ విద్యార్థిని కూడా యూనిట్‌ టెస్టులో ఫెయిల్‌ చేయగలడంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Story first published: Tuesday, April 16, 2019, 15:53 [IST]
Other articles published on Apr 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X