న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డు ఇన్నింగ్స్‌.. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఊతప్ప రికార్డు బద్దలు!!

Meghalaya player Abhay Negi slams fastest fifty in Syed Mushtaq Ali Trophy history

ముంబై: టీ20 క్రికెట్ వచ్చినప్పటినుండి రికార్డులు బద్దలవడం సాధారణంగా మారింది. ఓవర్లు తక్కువగా ఉండడంతో బ్యాట్స్‌మన్‌ ఉప్పెనలా బౌలర్లపై విరుచుకుపడడంతో అనేక రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో కూడా ఓ రికార్డు నమోదయింది. ముస్తాక్‌ అలీ టోర్నీలో మేఘాలయ ఆల్‌రౌండర్‌ అభయ్‌ నేగి రికార్డు ఇన్నింగ్స్‌తో సంచలనం సృష్టించాడు.

ఆసియా బాక్సింగ్‌లో 5 స్వర్ణాలు.. మొత్తం 12 పతకాలతో సత్తాచాటిన భారత్‌!!ఆసియా బాక్సింగ్‌లో 5 స్వర్ణాలు.. మొత్తం 12 పతకాలతో సత్తాచాటిన భారత్‌!!

ఊతప్ప రికార్డు బద్దలు:

ఊతప్ప రికార్డు బద్దలు:

ఆదివారం మిజోరంతో జరిగిన మ్యాచ్‌లో అభయ్‌ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది.. ఈ దేశవాళీ టోర్నీలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో భారత ఆటగాడు రాబిన్‌ ఊతప్ప పేరిటనున్న ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డును నేగి బద్దలు కొట్టాడు. భారతదేశ టీ20 క్రికెట్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ రికార్డును అభయ్‌ సమం చేశాడు. 2018 ఐపీఎల్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ అత్యంత వేగవంతమైన (14 బంతుల్లో) హాఫ్ సెంచరీని నమోదు చేసాడు.

మిజోరం ఓటమి:

మిజోరం ఓటమి:

ఈ మ్యాచ్‌లో అభయ్‌ (15 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 50 నాటౌట్‌)కు తోడు రవితేజ (53 నాటౌట్‌) కూడా మెరుపులు మెరిపించడంతో మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో మిజోరం నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి 25 రన్స్‌ తేడాతో ఓటమిపాలైంది.

12 బంతుల్లో హాఫ్ సెంచరీ:

12 బంతుల్లో హాఫ్ సెంచరీ:

ఉత్తరాఖండ్‌లో జన్మించిన 27 ఏళ్ల అభయ్‌ నేగి మేఘాలయ, త్రిపుర తరఫున ఆడుతున్నాడు. అభయ్‌ గత ఏడాది నవంబర్‌లో షిల్లాంగ్‌పై ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేశాడు. 2018 జనవరిలో రాంచీలో బెంగాల్‌పై టీ20 అరంగేట్రం చేశాడు. భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ వేగంగా టీ20 హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డును కలిగి ఉన్నాడు. 2007లో ఇంగ్లాండ్‌తో డర్బన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా యువరాజ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఈ రికార్డు సృష్టించాడు.

షా మెరుపులు:

షా మెరుపులు:

ఆదివారం అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు పృథ్వీ షా మెరుపులు మెరిపించాడు. అస్సాం బౌలర్లపై విరుచుకుపడి 39 బంతుల్లోనే 63 పరుగులు చేసాడు. పృథ్వీ షా 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసాడు. నిషేధిత ఉత్ప్రేరకం వాడి నిషేధానికి గురై క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన షా బ్యాటింగ్‌లో అదరగొట్టాడు.

Story first published: Monday, November 18, 2019, 9:33 [IST]
Other articles published on Nov 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X