న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంత త్వరగా ఊహించలేదు, నా తండ్రి కల నెరవేరుస్తా: మయాంక్‌ మార్కండే

 Mayank Markande ‘did not expect’ call to the Indian cricket team for Australia series

హైదరాబాద్: త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు టీ20ల సిరిస్‌కు గాను భారత జట్టులో చోటు దక్కడంపై పంజాబ్ లెగ్‌స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌కు భారత్ జట్టును ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

నాలుగో స్థానంలో కోహ్లీ!: తెరపైకి కొత్త విషయాన్ని తీసుకొచ్చిన గవాస్కర్నాలుగో స్థానంలో కోహ్లీ!: తెరపైకి కొత్త విషయాన్ని తీసుకొచ్చిన గవాస్కర్

మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం భారత్ జట్టుని ప్రకటించిన సెలక్టర్లు అనూహ్యంగా అందులో స్పిన్నర్ మయాంక్ మార్కండే‌కి చోటిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఆసీస్‌తో టీ20 సిరిస్‌కి మార్కండే

ఆసీస్‌తో టీ20 సిరిస్‌కి మార్కండే

వరల్డ్ కప్‌కు ముందు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు అతడి స్థానంలో మయాంక్ మార్కండే‌ను ఎంపిక చేశారు. భారత జట్టుకు ఎంపికవడం అతడికిదే తొలిసారి. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహిస్తోన్న మయాంక్ మార్కండే దేశవాళీ క్రికెట్‌లో, భారత్-ఎ జట్టు తరఫున ఇటీవలే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు.

జాతీయ జట్టుకు ఆడాలన్న తన కల నెరవేరింది

జాతీయ జట్టుకు ఆడాలన్న తన కల నెరవేరింది

ఈ నేపథ్యంలో జాతీయ జట్టుకు ఆడాలన్న తన కల నెరవేరిందని మయాంక్‌ అన్నాడు. శనివారం మీడియాతో మాట్లాడుతూ "ఇటీవల రంజీ ట్రోఫీ, భారత్-ఎ టీమ్ తరఫున నా ప్రదర్శనని సెలక్టర్లు గుర్తించారు. టీమిండియాలో అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే దీన్ని నేను ఊహించలేదు" అని అన్నాడు.

లెగ్ స్పిన్‌కి మెరుగులు దిద్దుకుంటున్నా

లెగ్ స్పిన్‌కి మెరుగులు దిద్దుకుంటున్నా

"ఇంత త్వరగా జాతీయ జట్టులో భాగం అవుతానని అనుకోలేదు. గత ఏడాదికాలంగా నా లెగ్ స్పిన్‌కి మెరుగులు దిద్దుకుంటున్నా. ఇండియా‘ఏ', రంజీ ట్రోఫీల్లో నా ప్రదర్శన వల్లే సెలక్టర్లు నన్ను ఎంపిక చేశారనుకుంటాను. నన్ను నిరూపించుకోవడానికి నాకో అవకాశం ఇచ్చిన సెలక్టర్లకు ధన్యవాదాలు" అని మయాంక్ మార్కండే తెలిపాడు.

నా తండ్రి కల నెరవేరుస్తా

నా తండ్రి కల నెరవేరుస్తా

"గాయం కారణంగా నా తండ్రి భారత్ జట్టుకి కనీసం ఒక్కసారి కూడా ఆడలేకపోయాడు. ఇప్పుడు నేను ఆడటం ద్వారా నా తండ్రి కల నెరవేరుస్తా. ఆసీస్‌పై తుది జట్టులో చోటు గురించి నేను ఆలోచించడం లేదు" అని మార్కండే వెల్లడించాడు. ఫిబ్రవరి 24న విశాఖపట్నంలో జరిగే తొలి టీ20తో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.

Story first published: Saturday, February 16, 2019, 15:59 [IST]
Other articles published on Feb 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X