న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపెనర్ అంటే ఇలా ఆడాలి.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు!

Matthew Gilkes guides Sydney Thunder to victory

క్రికెట్‌లో ఓపెనర్ల పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో ఓపెనర్ల ఆటే ఒక జట్టు ఆటతీరును నిర్దేశిస్తుంది. ఈ విషయం బాగా తెలిసినట్లు అదరగొట్టాడు మాథ్యూ గిల్క్స్. బిగ్ బ్యాష్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. అతని ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు మరో 9 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రెనగేడ్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించలేకపోయారు. మార్టిన్ గప్తిల్ (30) ఫర్వాలేదనిపించినా.. జేక్ ఫ్రేజర్ (5), శామ్ హార్పర్ (8) విఫలమయ్యారు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (22) జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు. చివర్లో విల్ సదర్లాండ్ (42 నాటౌట్) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142/9 పరుగులు చేయగలిగింది.

అనంతరం లక్ష్య ఛేదనలో సిడ్నీకి సూపర్ ఆరంభం లభించింది. డేవిడ్ వార్నర్ (26) ఫర్వాలేదనింపిచాడు. మరో ఓపెనర్ మాథ్యూ గిల్క్స్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 55 బంతుల్లోనే 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి అలెక్స్ రాస్ (40 నాటౌట్) నుంచి మంచి సహకారం లభించింది. ఆలివర్ డేవీస్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన అలెక్స్.. గిల్క్స్‌తో కలిసి రెచ్చిపోయాడు.

వీళ్లిద్దరూ రెనగేడ్స్ బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో ఆ జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చూస్తుండగానే లక్ష్యం కరిగిపోయింది. దీంతో ఆ జట్టు 18.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేసింది. సిడ్నీ విజయంలో కీలక పాత్ర పోషించిన గిల్క్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Thursday, January 19, 2023, 22:08 [IST]
Other articles published on Jan 19, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X