న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ విజయం నా భార్యకు అంకితం: పొల్లార్డ్

 Match win Dedicate to my wife, its her birthday says Pollard

ఈ రోజు నా భార్య పుట్టిన రోజు. ఈ అద్భుత విజయం ఆమెకే అంకితం అని ముంబయి ఇండియన్స్‌ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ తెలిపారు. ఐపీఎల్‌లో చాలా రోజుల తర్వాత ముంబై బ్యాట్స్‌మన్‌ను కీరన్ పొలార్డ్ బ్యాట్ ఝళిపించి మెరుపులు మెరిపించాడు. వాంఖడే వేదికగా కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ (83: 31 బంతుల్లో 3x4, 10x6) సిక్సులతో విరుచుకుపడడంతో.. 198 పరుగుల లక్ష్యాన్ని ముంబై చివరి బంతికి ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పొలార్డ్‌కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

ఆమెకే అంకితం:

ఆమెకే అంకితం:

మ్యాచ్ అనంతరం పొలార్డ్ మాట్లాడుతూ... 'దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంత బలం ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. అలాగే నా భార్య కూడా ధన్యవాదాలు. ఈ రోజు ఆమె పుట్టినరోజు.. ఈ అద్భుత విజయం ఆమెకే అంకితం' అని పొలార్డ్ తెలిపారు.

వాంఖడేలో బ్యాటింగ్ చేయడం ఇష్టం:

వాంఖడేలో బ్యాటింగ్ చేయడం ఇష్టం:

'వాంఖడేలో బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టం. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చా. పిచ్‌పై స్పిన్ బౌలింగ్ కూడా అంతలా పనిచేయకపోవడంతో.. అశ్విన్ ని టార్గెట్ చేసాం. దురదృష్టవశాత్తు అది ఫలించలేదు. ఈ పిచ్‌పై బౌలింగ్ చేయడం కష్టం. పిచ్‌ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. మధ్య ఓవర్లలో కొద్దిగా తడబడ్డా కూడా చివరికి విజయం సాధించాం' అని పొలార్డ్ పేర్కొన్నారు.

ముందే టార్గెట్ చేశా:

ముందే టార్గెట్ చేశా:

'చివర్లో ఓ రెండు ఓవర్లని టార్గెట్ చేయాలని ముందే అనుకున్నా. షమీ, కరన్ ఓవర్ల రూపంలో నాకు ఆ అవకాశం లభించింది. ప్రతిసారి 190 పైచిలుకు స్కోర్లని ఛేదించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ రోజు సాధ్యమైంది. జట్టు విజయం సాధించడం సంతోషంగా ఉంది. వచ్చే మ్యాచ్‌కు రోహిత్ జట్టులోకి వస్తాడు' అని పొలార్డ్ చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, April 11, 2019, 18:15 [IST]
Other articles published on Apr 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X