న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ చేతుల మీదుగా జ్ఞాపిక, ట్రిపుల్ సెంచరీ సాధించిన క్రిస్ బ్రాడ్

Match Referee Chris Broad Completes Triple Century of ODIs

హైదరాబాద్: భారత్‌-వెస్టిండీస్‌ మధ్య మూడో వన్డేతో రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ అరుదైన రికార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఎలైట్‌ ప్యానెల్‌ రిఫరీ అయిన బ్రాడ్‌... 300 వన్డేలకు రిఫరీగా వ్యవహరించి అరుదైన గుర్తింపు అందుకున్నాడు. ఈ సందర్భంగా వెస్టిండీస్-భారత్ మూడో వన్డే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు క్రిస్‌ బ్రాడ్‌కు భారత కెప్టెన్‌ కోహ్లి జ్ఞాపిక అందజేశాడు.

ఫీట్ నమోదు చేసిన రెండో వ్యక్తి కావడం

ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న క్రిస్ బ్రాడ్ 300 వన్డే మ్యాచ్‌లకు రిఫరీగా వహించారు. తద్వారా ఈ ఫీట్ నమోదు చేసిన రెండో వ్యక్తి కావడం విశేషం. ఓవరాల్‌గా శ్రీలంకకు చెందిన రంజన్ మదుగలే 336 వన్డేలకు రిఫరీగా వ్యవహరించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

 2004లో ఐసీసీ రిఫరీగా కెరీర్ ప్రారంభించి

2004లో ఐసీసీ రిఫరీగా కెరీర్ ప్రారంభించి

వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య పుణేలో జరగుతున్న 3వ వన్డేకు రిఫరీగా వ్యవహరించారు క్రిస్ బ్రాడ్. 2004లో ఐసీసీ రిఫరీగా కెరీర్ ప్రారంభించిన ఆయనకు ఇది 300వ వన్డే మ్యాచ్. టెస్టుల్లోనూ రంజన్ మదుగలే 175 టెస్టులకు రిఫరీగా వ్యవహరించి తొలి స్థానాన్ని ఆక్రమించగా.. 98 టెస్టులతో క్రిస్ బ్రాడ్ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇతనికంటే ముందు రంజన్‌ మధుగలె (శ్రీలంక-336

ఇతనికంటే ముందు రంజన్‌ మధుగలె (శ్రీలంక-336

2019 మార్చిలో వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే రెండో టెస్టుతో 100 టెస్టులకు రిఫరీగా వ్యవహరించిన రెండో వ్యక్తి అవుతాడు. ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్‌ బ్రాడ్‌ 2004లో ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌కు తొలిసారి రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన కంటే ముందు రంజన్‌ మధుగలె (శ్రీలంక-336 మ్యాచ్‌లు) అత్యధిక మ్యాచ్‌లకు రిఫరీగా ఉన్నారు.

ఇంగ్లాండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఇతడి కుమారుడే

ఇంగ్లాండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఇతడి కుమారుడే

వన్డేల్లో రంజన్ మదుగలే 336, క్రిస్ బ్రాడ్ 300, న్యూజిలాండ్‌కు చెందిన జెఫ్ క్రో 270, రోషన్ మహనామా 222, జవగళ్ శ్రీనాథ్ 212 టాప్-5లో నిలిచారు. బ్రాడ్ ఇంగ్లాండ్ తరఫున 24 టెస్టులాడి 6 సెంచరీలు సాధించాడు. 34 వన్డేలాడిన బ్రాడ్ 40 సగటుతో 1361 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ ఇతడి కుమారుడే అన్న విషయం తెలిసిందే.

Story first published: Sunday, October 28, 2018, 6:25 [IST]
Other articles published on Oct 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X