న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డు మెజారిటీ: ఎంపీగా గెలిచిన బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్

Mashrafe Mortaza, Bangladeshs ODI captain, wins parliamentary elections from Narail-2 constituency

హైదరాబాద్: బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ టీమ్ కెప్టెన్ మష్రఫె మొర్తజా ఆ దేశ పార్లమెంటరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. నరెయిల్-2 నియోజకవర్గం నుంచి అధికార పార్టీ ఆవామీ లీగ్ తరఫున పోటీ చేసిన మొర్తజా అత్యధిక మెజార్టీతో విజయం సాధించాడు.

మష్రఫెకు 274418 ఓట్లు

మష్రఫెకు 274418 ఓట్లు

ఆదివారం విడుదల చేసిన ఎన్నికల ఫలితాల్లో మష్రఫెకు 274418 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థికి కేవలం 8006 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 300 సీట్లు ఉన్న బంగ్లాదేశ్ సభలో 266 స్థానాల్లో ఆవామీ లీగ్ గెలిచి సంచలనం సృష్టించింది. దీంతో వరుసగా మూడోసారి షేక్ హసీనా ప్రధాని పదవి చేపట్టారు.

 నేషనల్ యూనిటీ ఫ్రంట్‌కు కేవలం ఏడు స్థానాలు మాత్రమే

నేషనల్ యూనిటీ ఫ్రంట్‌కు కేవలం ఏడు స్థానాలు మాత్రమే

ఆవామీ లీగ్ మిత్రపక్షమైన జతియా పార్టీ 21 స్థానాల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నేషనల్ ఫ్రంట్ ప్రధాన పార్టీగా ఉన్న ప్రత్యర్థి నేషనల్ యూనిటీ ఫ్రంట్ కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక, రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఈ ఎన్నికల్లో భారీ హింస చోటు చేసుకోవడంతో 17 మంది మృత్యువాత పడ్డారు.

మష్రఫె మొర్తజా మాట్లాడుతూ

మష్రఫె మొర్తజా మాట్లాడుతూ

తన గెలుపుపై మష్రఫె మొర్తజా మాట్లాడుతూ "రాజకీయాల నుంచి ప్రేరణ పొందుతున్నా. దేశం అభివృద్ధి జరగాలంటే అది కేవలం రాజకీయాలతోనే సాధ్యం. నా దేశం కోసం ఏదైనా చేసేందుకు ఇప్పుడు నాకు గొప్ప అవకాశం దక్కింది. రాబాయే 2019 వరల్డ్ కప్ కోసం ఎంతో ఆతృతగా ఉన్నా" అని చెప్పుకొచ్చాడు.

టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన మొర్తజా

టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన మొర్తజా

ప్రస్తుతం మొర్తజా వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. గాయాల కారణంగా టెస్టు క్రికెట్‌కు 2009లోనే వీడ్కోలు పలికాడు. బంగ్లా తరుపున 36 టెస్టు మ్యాచ్‌లాడిన మొర్తజా 2009లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక, 2017లో టీ20 క్రికెట్‌కు సైతం మొర్తజా వీడ్కోలు పలికాడు.

Story first published: Monday, December 31, 2018, 13:51 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X