న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మార్ష్‌ కప్‌ టోర్నీలో ఆసక్తికర ఘటన.. టాస్ వేస్తే 10 మీటర్ల దూరం పడిన కాయిన్‌(వీడియో)

Marsh Cup Final: Usman Khawaja’s unique coin toss leaves opposition captain in splits

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నమెంట్ అయిన మార్ష్‌ కప్‌ వన్డే టోర్నీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ టోర్నీ ఫైనల్ పోరులో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా-క్వీన్స్‌లాండ్‌ జట్లు తలపడ్డాయి. మ్యాచ్‌ ఆరంభానికి ముందు టాస్‌ వేసే క‍్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు ఉస్మాన్‌ ఖవాజా-టర్నర్‌లు మైదానంలో వచ్చారు.

10 రోజుల వ్యవధిలో 4 ఇన్నింగ్స్‌ విజయాలు.. టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు!!10 రోజుల వ్యవధిలో 4 ఇన్నింగ్స్‌ విజయాలు.. టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు!!

10 మీటర్ల దూరం పడిన కాయిన్‌:

టాస్ కాయిన్‌ను క్వీన్స్‌లాండ్‌ కెప్టెన్ ఖవాజా అందుకున్నాడు. టాస్‌ వేయమని మ్యాచ్‌ రిఫరీ ఓకే చెప్పగానే.. ఖవాజా కాస్త ముందుకు దూకుతూ వెళ్లి కాయిన్‌ను పైకి వేసాడు. కాయిన్‌ దాదాపు 10 మీటర్ల దూరంగా వెళ్లి పడింది. కాయిన్‌ను ఒక ఎండ్‌ నుండి వేస్తే అది దాదాపు మరొక ఎండ్‌లో పడింది. రిఫరీ నవ్వుకుంటూ కాయిన్‌ పడిన చోటకు వెళ్లి వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా టాస్‌ గెలిచిందని చెప్పాడు.

బౌలింగ్‌ చేసేవేంట్రా:

బౌలింగ్‌ చేసేవేంట్రా:

ఖవాజా టాస్‌ వేసిన వీడియోను వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దాంతో ఆ వీడియో వైరల్ అయింది. ఖవాజాపై సెటైర్లు పేలుతున్నాయి. 'టాస్‌ వేయమంటే.. బౌలింగ్‌ చేసేవేంట్రా' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'కాయిన్‌ అనే సంగతి మరచిపోయి ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేశావా' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు.

ఆసీస్‌ జట్టులో చోటు కోల్పోయిన ఖవాజా:

ఆసీస్‌ జట్టులో చోటు కోల్పోయిన ఖవాజా:

ఖవాజా గత కొంతకాలంగా ఫామ్‌ కోల్పోవడంతో ఆసీస్‌ జట్టులో చోటు కోల్పోయాడు. యాషెస్ సిరీస్‌లో కూడా పెద్దగా ఆడలేదు. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు ఖవాజాను ఎంపిక చేయలేదు. ఇక చేసేదేంలేక దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతూ ఫామ్‌లోకి రావడానికి యత్నిస్తున్నాడు. మార్ష్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఖవాజా 26 పరుగులే చేశాడు.

 వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాదే మార్ష్‌ కప్‌:

వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాదే మార్ష్‌ కప్‌:

మార్ష్‌ కప్‌ వన్డే టోర్నీని ఆస్ట్రన్‌ టర్నర్‌ నేతృత్వంలోని వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన క్వీన్స్‌లాండ్‌ 49.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 48 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షాన్‌ మార్ష్‌ (101; 132 బంతుల్లో 13 ఫోర్లు) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Tuesday, November 26, 2019, 15:44 [IST]
Other articles published on Nov 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X