న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌పైకి కొత్త స్పిన్నర్‌ను ప్రయోగించనున్న ఆసీస్

Marnus Labsuchagne added to Australias Test squad for SCG Test, putting pressure on Mitchell Marsh

మెల్‌బౌర్న్‌: పెర్త్ పరాజయం అనంతరం టీమిండియా పుంజుకుంది. బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా మెల్‌బౌర్న్ వేదికగా విజృంభించింది. అన్ని విభాగాల్లో రాణించిన టీమిండియా ఆసీస్‌ను మట్టి కరిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగుల ఆధిక్యాన్ని మిగిల్చి చివరి వరకూ అదే స్థాయిలో రాణించి 137 పరుగుల విజయంతో మ్యాచ్ గెలిచింది. ఈ మేర భారత్‌ను ఓడించేందుకు ఆసీస్ జట్టులో మార్పులు చేపట్టింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ క్రమంలో భారత్‌‌తో గురువారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభంకానున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు కొత్త ఆల్‌రౌండర్‌ని తీసుకుంది.

ఆసీస్ జట్టులోకి అరంగేట్రం చేసిన మార్నస్

ఆసీస్ జట్టులోకి అరంగేట్రం చేసిన మార్నస్

ఇటీవల పాకిస్థాన్‌తో యూఏఈ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఆసీస్ జట్టులోకి అరంగేట్రం చేసిన మార్నస్ ఏడు వికెట్లు పడగొట్టాడు. అది కూడా కేవలం 81 పరుగులు మాత్రమే ఇచ్చి విజయం దిశగా నడిపించాడు. కానీ.. భారత్‌తో టెస్టు సిరీస్‌కి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అందుబాటులోకి రావడంతో అతడ్ని ఎంపిక చేయలేదు. అయితే.. పెర్త్ వేదికగా స్పిన్నర్ లయన్‌తో రాణించిన ఆసీస్ మరోసారి భారత్‌పై స్పిన్నింగ్ విధానాన్నే ప్రయోగించాలని చూస్తోంది.

ఆడించే అవకాశాలను పరిశీలిస్తామని కెప్టెన్

ఆడించే అవకాశాలను పరిశీలిస్తామని కెప్టెన్

ఈ మేర సిడ్నీ టెస్టులో అతడ్ని ఆడించే అవకాశాలను పరిశీలిస్తామని కెప్టెన్ టిమ్‌పైన్ వెల్లడించాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే మార్నస్.. తన లెగ్‌ స్పిన్‌‌తోనూ మ్యాచ్‌ని మలుపు తిప్పే ప్రదర్శన చేయగలడు. మరోవైపు ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పేలవంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో.. సిడ్నీ టెస్టులో అతడికి అవకాశమివ్వాలని ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది.

మూడు టెస్టుల్లో 52, 4, 47, 21, 78 పరుగులతో ఫామ్‌ని

మూడు టెస్టుల్లో 52, 4, 47, 21, 78 పరుగులతో ఫామ్‌ని

ఇటీవల క్వీన్స్‌లాండ్‌ తరఫున ఆడిన మార్నస్.. మూడు టెస్టుల్లో 52, 4, 47, 21, 78 పరుగులతో ఫామ్‌ని చాటుకున్నాడు. ఆదివారంతో బాల్ ట్యాంపరింగ్ నుంచి నిషేదాన్ని పూర్తి చేసుకున్న బాన్‌క్రాఫ్ట్ అందుబాటులో ఉన్నా అతను జట్టులోకి ఎంపిక కాలేదు.

నాలుగో టెస్టులో భారత్ తో‌తలపడనున్న ఆసీస్ జట్టు:

నాలుగో టెస్టులో భారత్ తో‌తలపడనున్న ఆసీస్ జట్టు:

టిమ్‌పైన్ (కెప్టెన్ / వికెట్ కీపర్), హేజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్, హ్యాండ్స్‌కబ్, హారిస్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయన్, షాన్ మార్ష్, పీటర్ సిడిల్, మిచెల్ స్టార్క్, మార్నస్

Story first published: Sunday, December 30, 2018, 15:15 [IST]
Other articles published on Dec 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X