న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జాతీయ జట్టు సెలక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న మార్క్ వా

Mark Waugh steps down as Australian selector

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం మార్క్ వా ఆ దేశ క్రికెట్ జాతీయ జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చేసుకున్న ఒప్పందం ఆగష్టు 31తో ముగుస్తున్నా.. ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల వరకూ బాధ్యతల్లో కొనసాగనున్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సాధించిన విజయాలు చూసి గర్వపడుతున్నాను. ఇన్నాళ్లు సహచరులంతా నాకు బాగా సహకరించారు. ఆస్ట్రేలియా జట్టు మంచి టాలెంటెడ్ ఆటగాళ్లతో సాగిపోతోంది. వాళ్లు ఆటతీరులో మంచి స్థాయిలో దూసుకుపోతున్నారు. ఈ జట్టు ఇలానే విజయ పంథాలో కొనసాగాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.

మార్క్ వా.. బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనా అతని స్థానంలో మరొకరిని తీసుకుంటున్నట్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించకపోవడం గమనార్హం. ఇప్పటికీ ఈ రేసులో ట్రెవర్ హాన్స్, గ్రెగ్ చాపెల్, జస్టిన్ లాంగర్ ఉన్నారు.

మార్క్ వా అతని కెరీర్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహించి 128టెస్టులు, 244 వన్డేలలో ఆడారు. జాతీయ జట్టుకు 2014వ సంవత్సరం నుంచి సెలక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పదవి విరమణ అనంతరం ప్రముఖ క్రీడా ఛానెల్ అయినటువంటి ఫాక్స్ స్పోర్ట్స్‌లో కామెంటేటర్‌గా కొనసాగనున్నారు. ఇందుకుగాను ఆరేళ్లు ఒప్పందం కుదుర్చుకున్న ఫాక్స్ స్పోర్ట్స్ సంస్థ 1.2 ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

Story first published: Tuesday, May 15, 2018, 14:14 [IST]
Other articles published on May 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X