న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ చర్చ ఎప్పటికీ ఉండేదే.. డివిలియర్స్ కమ్ బ్యాక్‌పై సౌతాఫ్రికా కోచ్ కీలక వ్యాఖ్యలు!

Mark Boucher gives major update on Ab de Villiers return to play international cricket

కేప్‌టౌన్: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌ పునరాగమనంపై సఫారీ టీమ్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏబీడీ బాగా ఆడినంత కాలం తమ జట్టు ఎంపికలో ఉంటాడని తెలిపాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో రాణించినట్లే మంచి ప్రదర్శన కొనసాగిస్తే సౌతాఫ్రికా జట్టులోకి రీఎంట్రీ తిరిగొస్తాడని పేర్కొన్నాడు.

ఇక యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో ఏబీడీ బెంగళూరు తరఫున 15 మ్యాచ్‌లు ఆడి 454 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బౌచర్‌ శనివారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ జట్టు ఎంపికలో డివిలియర్స్‌ చర్చకు వస్తాడని చెప్పాడు.

Mark Boucher gives major update on Ab de Villiers return to play international cricket

'కోవిడ్‌-19 కన్నా ముందే డివిలియర్స్‌ ఎంపిక విషయం తెరపైకి వచ్చింది. అతడు బాగా ఆడినన్ని రోజులు మా చర్చల్లో ఉంటాడు. అయితే, భవిష్యత్తు ప్రణాళికల గురించి నేనింకా అతనితో మాట్లాడలేదు. ఇటీవల అతను ఐపీఎల్‌లో రాణించాడు. ఇలాగే కొనసాగితే తిరిగి సౌతాఫ్రికా జట్టులోకి వస్తాడు' అని బౌచర్‌ పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా, ఏబీ 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆపై ఇతర టీ20 లీగుల్లో ఆడుతూ అభిమానులను అలరించిన ఏబీడీ.. గతేడాది వన్డే ప్రపంచకప్‌ సమయంలో తిరిగి సౌతాఫ్రికా తరఫున బరిలోకి దిగాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ అంగీకరించలేదు. ఆ తర్వాత రియలైజ్ అయిన సఫరీ టీమ్ మేనేజ్‌మెంట్ టీ20 ప్రపంచకప్ జట్టులో ఏబీడీని తీసుకుంటామని తెలిపింది. అయితే పూర్తిగా ఫిట్‌గా ఉంటే తాను మళ్లీ రీ ఎంట్రీ ఇస్తానని ఏబీడీ స్పష్టం చేశాడు. అయితే ఐపీఎల్‌లో రాణించడంతో మళ్లీ ఏబీడీ కమ్ బ్యాక్ చర్చలు ఊపందుకున్నాయి.

నా కెప్టెన్సీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. సూటి పోటి మాటలపై రోహిత్ శర్మ అసహనం!నా కెప్టెన్సీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. సూటి పోటి మాటలపై రోహిత్ శర్మ అసహనం!

Story first published: Sunday, November 22, 2020, 13:47 [IST]
Other articles published on Nov 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X