న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

20 సార్లు బాత్‌రూమ్‌కు: మెస్సీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మారోడనా

Maradona: Its useless making a leader of Messi

హైదరాబాద్: లియోనల్ మెస్సీ... ప్రస్తుత సాకర్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అభిమానులైతే మెస్సీని ఓ దేవుడిగా భావిస్తారు. అలాంటి మెస్సీని తన దేశానికి చెందిన మరో ఆటగాడు అతనో లీడరా అంటూ ప్రశ్నించాడు. ఇంతకీ మెస్సీపై అంతలా విరుచుకుపడిన ఆ ఆటగాడు మరెవరో కాదు అర్జెంటీనా మాజీ దిగ్గజం డిగో మారడోనా.

హైదరాబాద్ టెస్ట్: పంత్ సెంచరీ మిస్, భారత్ 367 ఆలౌట్, ఆధిక్యం 56హైదరాబాద్ టెస్ట్: పంత్ సెంచరీ మిస్, భారత్ 367 ఆలౌట్, ఆధిక్యం 56

మెస్సీ అసలు లీడరే కాదని, అతడిని పుట్‌బాల్ దేవుడిలా చూడొద్దంటూ అభిమానులను కోరాడు. సాకర్ ప్రపంచంలో అత్యుత్తమ దిగ్గజ ఆటగాళ్లలో డిగో మారడోనా ఒకడు. అంతేకాదు బ్రెజిల్ గ్రేట్ పీలేకు సరిసమానంగా మారడోనాను మాత్రమే గుర్తిస్తారు. అలాంటి మారడోనా తన సొంత దేశం ప్లేయర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెను చర్చనీయాంశమైంది.

మారడోనా మాట్లాడుతూ

మారడోనా మాట్లాడుతూ

ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారడోనా మాట్లాడుతూ మెస్సీ తన క్లబ్ బార్సిలోనాకు ఒకలా, తన జాతీయ జట్టుకు మరోలా ఆడతాడని మారడోనా విమర్శించాడు. నిజమైన మెస్సీ అంటే బార్సిలోనా జెర్సీ వేసుకున్నపుడే అని మారడోనా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మెస్సీ గొప్ప ప్లేయర్ కానీ లీడర్ మాత్రం కాదు

"మెస్సీ గొప్ప ప్లేయర్ కానీ లీడర్ మాత్రం కాదు. మ్యాచ్‌కు ముందు 20 సార్లు టాయిలెట్‌కు వెళ్లే వ్యక్తి నుంచి ఓ లీడర్‌ను ఆశించడం సరి కాదు. అర్జెంటీనా తరఫున ముఖ్యమైన మ్యాచ్‌లు ఆడే ముందు మెస్సీ చాలా ఒత్తిడికి గురవుతాడు. కొన్నిసార్లు వాంతులు కూడా చేసుకుంటాడు" అని మారడోనా అన్నాడు.

ఐదుసార్లు ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

ఐదుసార్లు ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

మారడోనా చెప్పినట్లు బార్సిలోనా క్లబ్ తరఫున ఆడే సమయంలో మాత్రం మెస్సీ తనలోని అత్యుత్తమ ఆటతీరుని కనబరుస్తుంటాడు. అంతేకాదు మెస్సీ ఐదుసార్లు ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అయితే దేశం తరుపున ఆడే క్రమంలో మెస్సీ సరైన ప్రదర్శన చేయలేకపోయాడు.

2014 వరల్డ్‌కప్ ఫైనల్లో తీవ్ర ఒత్తిడికి లోనైన మెస్సీ

2014 వరల్డ్‌కప్ ఫైనల్లో తీవ్ర ఒత్తిడికి లోనైన మెస్సీ

దీనిపై ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. 2014 వరల్డ్‌కప్ ఫైనల్లో తీవ్ర ఒత్తిడికి లోనై జర్మనీ చేతిలో అర్జెంటీనా ఓటమికి కారణమయ్యాడు. ఈ ఏడాది రష్యా వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను కనీసం ప్రిక్వార్టర్స్ స్టేజ్‌ను కూడా దాటించలేకపోయాడు. దీంతో మెస్సీపై ఉన్న ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరం ఉందని మారడోనా తెలిపాడు.

Story first published: Sunday, October 14, 2018, 13:38 [IST]
Other articles published on Oct 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X