ఈడెన్‌లో ‌మ్యాచ్: మనీష్ పాండే స్టన్నింగ్ క్యాచ్ వీడియో చూశారా?

Posted By:
Manish Pandey

హైదరాబాద్: ఐపీఎల్‌ 11వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌‌‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు మనీష్ పాండే అద్భుత క్యాచ్‌ పట్టాడు. వర్షం తర్వాత మ్యాచ్‌ పునప్రారంభమైన నాలుగు బంతులకే కోల్‌కతా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ నితీష్‌ రాణా స్టాన్‌ లేక్‌ బౌలింగ్‌లో ఆఫ్‌ వికెట్‌ మీదుగా వచ్చిన బంతిని గల్లీలో ఆడే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్ పాండే రెప్పపాటు సమయంలో గాల్లోకి డైవ్‌ చేసి అద్భుతమైన క్యాచ్‌గా దానిని అందుకున్నాడు. అయితే, తొలుత పాండే చేతుల నుంచి బంతి జారినట్లే జారి చిక్కింది. దీంతో దూకుడుగా ఆడుతోన్న నితీష్‌ రాణా (14 బంతుల్లో 18; 2 ఫోర్లు, ఒక సిక్సు) వద్ద పెవిలియన్‌ చేరాడు.

ఆ తర్వాత షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌లో సునీల్‌ నరైన్‌ భారీ షాట్‌ ఆడగా.. బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న పాండే మరో సారి అద్భుత ఫీల్డింగ్‌తో బంతిని సిక్సు వెళ్లకుండా అడ్డుకున్నాడు. అయితే ఈ క్రమంలో బంతిని గాల్లోకి విసిరి క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. సమన్వయ లోపం కారణంగా అది సాధ్యపడలేదు.

అనంతరం స్టాన్లేక్ ఓవర్లో రసెల్‌ను కూడా అద్భుత క్యాచ్‌తో పాండే పెవిలియన్ చేర్చాడు. వెనక్కి పరిగెడుతూ.. కష్ట సాధ్యమైన క్యాచ్‌ను ఎలాంటి తడబాటు లేకుండా అందుకున్నాడు. తను నాలుగేళ్లుగా కోల్‌కతా తరఫున ఆడిన ఈడెన్‌లో.. ఈసారి ప్రత్యర్థిగా అద్భుత ఫీల్డింగ్‌తో అలరించాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 14, 2018, 22:22 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి