న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

15 ఏళ్ల కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన లసిత్ మలింగ

Malinga To Retire From ODIs After First Match Against Bangladesh || Oneindia Telugu
Malinga to retire from ODIs after first Bangladesh match, says Karunaratne

హైదరాబాద్: శ్రీలంక పేసర్ లసిత్ మలింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు రంగం సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌లో భాగంగా జులై 26న జరిగే తొలి వన్డేనే లసిత్ మలింగకు ఆఖరి వన్డే కానుంది. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే స్పష్టం చేశాడు.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

జులై 26న బంగ్లాదేశ్‌తో

జులై 26న బంగ్లాదేశ్‌తో

జులై 26న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌ తర్వాత వన్డేలకు లసిత్ మలింగ గుడ్‌బై చెబుతున్నట్లు లంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే ప్రకటించాడు. 35 ఏళ్ల మలింగ ఈ సిరీస్‌లో తొలి వన్డేలో మాత్రమే ఆడతాడని కరుణరత్నే చెప్పాడు. ఇప్పటిదాకా మలింగ 15 ఏళ్ల కెరీర్‌లో 225 వన్డేల్లో 29.02 సగటుతో 335 వికెట్లు పడగొట్టాడు.

మలింగకు ఆఖరి వన్డే

మలింగకు ఆఖరి వన్డే

శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్‌ (523), చమిందా వాస్‌ (399) తర్వాత వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన లంక బౌలర్‌గా మలింగ నిలిచాడు. కాగా, మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం ప్రారంభం కానుంది. ఇదే మలింగకు ఆఖరి వన్డే కానుంది.

దిముత్ కరుణరత్నే మాట్లాడుతూ

దిముత్ కరుణరత్నే మాట్లాడుతూ

తొలి వన్డేకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దిముత్ కరుణరత్నే మాట్లాడుతూ "ఈ సిరిస్ తర్వాత మలింగ అందుబాటులో ఉండటం లేదు... కాబట్టి వికెట్లు తీసే మరొక బౌలర్‌ను కావాలి. బంగ్లాతో జరగనున్న తొలి మ్యాచ్‌లో మలింగ ఆడతాడు. ఆ తర్వాత రిటైర్ అవుతాడు. ఈ విషయాన్ని మలింగనే చెప్పాడు" అని చెప్పాడు.

సెలక్టర్లతో ఏం చెప్పాడో నాకు తెలియదు గానీ

సెలక్టర్లతో ఏం చెప్పాడో నాకు తెలియదు గానీ

"సెలక్టర్లతో ఏం చెప్పాడో నాకు తెలియదు గానీ... నాతో మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడతానని అన్నాడు" అని కెప్టెన్ దిముత్ కరుణరత్నే చెప్పాడు. కెప్టెన్‌గా వరల్డ్‌కప్ అనంతం మంచి జట్టుని రూపొందించే బాధ్యత తనపై ఉందని కరుణరత్నే తెలిపాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో లసిత్ మలింగ 13 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, July 23, 2019, 11:51 [IST]
Other articles published on Jul 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X