న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మీరంటే పిచ్చి: సచిన్ టెండూల్కర్‌కు 16 ఏళ్ల యువకుడి లేఖ

By Nageshwara Rao
'Make us proud'; Sachin Tendulkar gives his fan the most memorable gift

హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు ఇటీవల కాలంలో అభిమానులు లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 16 ఏళ్ల శుభం చోదన్‌కర్‌ అనే యువకుడు సచిన్‌కు ట్విట్టర్‌లో లేఖ రాశాడు. ఆ లేఖను ఒక్కసారి పరిశీలిద్దాం...

'డియర్‌ సచిన్‌ సర్‌, నా పేరు శుభం చోదన్‌కర్‌. నేను మీకు పెద్ద అభిమానిని. మీరే నాకు స్ఫూర్తి. నా రోల్‌ మోడల్‌. నా గురువు. మా ఇంట్లో ప్రతి చోటా మీ ఫొటోలే. నా మొబైల్‌ వాల్‌ పేపర్‌పై, నా కబోర్డుపై, చదువుకునే టేబుల్‌పై. మీ టీ షర్టు కూడా ఒకటి నా వద్ద ఉంది. దాన్ని నేను ధరించినప్పుడు ఎంతో గర్వంగా ఫీలవుతుంటాను' అని లేఖలో పేర్కొన్నాడు.

'2017 సెప్టెంబరు 1న మీరు గిర్గావ్‌లోని గణేశ్‌ మండపాన్ని సందర్శించారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. 'సచిన్‌ సచిన్‌' అని పిలుస్తూ నా అభిమానాన్ని చాటుకున్నాను. నా కల నిజమైంది. కాకపోతే అది సగం మాత్రమే. వ్యక్తిగతంగా ఎప్పుడైతే మిమ్మల్ని కలుస్తానో అప్పుడు నా పూర్తి కల సాకారమైనట్లు. అప్పుడే నీ నుంచి నాకు ఆశీర్వాదాలు దక్కినట్లు' అని రాసుకొచ్చాడు.

'నేను కూడా క్రికెట్‌లో మీలా గొప్పగా రాణించాలని కోరుకుంటున్నాను. అంతకంటే ముందు వినయం, మర్యాదగా నడుచుకోవడం నేర్చుకోవాలి. సార్‌.. నేను భవిష్యత్తులో దేశం గర్వపడే స్థాయికి చేరుకోవాలని నన్ను ఆశీర్వదించండి. ప్లేబాక్‌ సింగర్‌ కిషోర్‌ కుమార్‌ సార్‌కి కూడా నేను అభిమానిని. మీలాగే ఆయన పాటల్నే వింటుంటాను' అని అందులో పేర్కొన్నాడు.

ఈ లేఖను ట్విటర్‌‌లో తన అభిమానులకు షేర్ చేసిన సచిన్ టెండూల్కర్ 'శుభం.. లెటర్‌కు ధన్యవాదాలు. బాగా కష్టపడు. విజయాల కోసం పోరాడు. అప్పుడు నిన్ను చూసి దేశం గర్వపడుతుంది' అని ట్వీట్ చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 2, 2017, 12:26 [IST]
Other articles published on Dec 2, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X