న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లలో జయవర్దనే రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ.. మహేల రియాక్షన్ ఏంటంటే?

Mahela Jayawardena reacts to Virat Kohli breaking his record in T20 World Cups

ఈ టీ20 ప్రపంచకప్‌లో అత్యద్భుత ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటి వరకు అతను ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. ఈ మూడు మ్యాచుల్లోనూ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్‌ను క్రీడాభిమానులు మరో పదేళ్లపాటు మర్చిపోలేరనడం అతిశయోక్తి కాదు. అలాగే బంగ్లాదేశ్‌పై కూడా అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీ.. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మహేల జయవర్దనే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

 విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్

విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్

ఇంగ్లండ్ పర్యటన తర్వాత నెలరోజులపైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. ఆసియా కప్‌లో మళ్లీ జట్టుతో కలిశాడు. ఆ టోర్నీలో ఫర్వాలేదనిపించిన అతను.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినా.. అప్పటికే భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ ఆ ఇన్నింగ్స్ చూసిన వాళ్లందరూ కూడా తమకు మునుపటి కోహ్లీ తిరిగొస్తున్న పోలికలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

 టీ20 ప్రపంచకప్‌లో కూడా అదే జోరు..

టీ20 ప్రపంచకప్‌లో కూడా అదే జోరు..

తనపై అందరూ పెట్టుకున్న అంచనాలను అందుకున్న కోహ్లీ.. టీ20 ప్రపంచకప్‌లో కూడా అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు ఒంటి చేత్తో విజయాన్నందించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై కూడా రాణించాడు. సౌతాఫ్రికా మ్యాచ్‌లో తొందరపాటుతో అవుటైనా.. మళ్లీ బంగ్లాదేశ్‌పై 44 బంతుల్లో 64 పరుగులతో మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికే ఈ మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కింది.

 జయవర్దనే రికార్డు బద్దలు..

జయవర్దనే రికార్డు బద్దలు..

బంగ్లాపై హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ.. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా మహేలయ జయవర్దనే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. తన కెరీర్‌లో 31 టీ20 ప్రపంచకప్ మ్యాచులు ఆడిన జయవర్దనే.. 39.07 సగటు, 134.74 స్ట్రైక్‌రేటుతో 1016 పరుగులు చేశాడు. అయితే బంగ్లాదేశ్‌పై 64 పరుగులు చేసిన కోహ్లీ.. కేవలం 25 మ్యాచుల్లోనే 1065 పరుగులతో నిలిచాడు.

మహేల ఏమన్నాడంటే?

మహేల ఏమన్నాడంటే?

తన రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడంపై శ్రీలంక లెజెండ్ మహేల జయవర్దనే స్పందించాడు. ఐసీసీ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో విడుదల చేసిన వీడియోలో జయవర్దనే మాట్లాడుతూ.. 'రికార్డులు ఉండేది బద్దలవడానికే. నా రికార్డు కూడా ఎవరో ఒకరు బద్దలు కొట్టాల్సిందే కదా. ఇప్పుడు నువ్వు బద్దలు కొట్టావ్. కంగ్రాచ్యులేషన్స్ విరాట్. నువ్వు మొదటి నుంచి గొప్ప యోధుడివి. ఫామ్ తాత్కాలికం కానీ, క్లాస్ మాత్రమే శాశ్వతం' అన్నాడు.

Story first published: Friday, November 4, 2022, 13:16 [IST]
Other articles published on Nov 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X