న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-పాక్ సిరీస్ ప్రభుత్వం నిర్ణయించాలి.. అక్తర్ కాదు: మాజీ క్రికెటర్

Madan Lal has responded to Akhtar, its the government who makes decisions and not the BCCI

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నిర్మూలన ఫండ్ కోసం.. భారత్-పాకిస్థాన్ మధ్య వన్డే సిరీస్ నిర్వహించాలన్న మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదనను వ్యతిరేకించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే టీమిండియా లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఈ ప్రతిపాదనను తీసిపారేయగా.. తాజాగా మాజీ క్రికెటర్ మదన్‌ లాల్ సైతం తప్పుబట్టాడు.

బీసీసీఐ కూడా ఏం చేయలేదు..

బీసీసీఐ కూడా ఏం చేయలేదు..

భారత్-పాక్ సిరీస్‌ను నిర్ణయించాల్సింది ప్రభుత్వమని, అక్తర్, బీసీసీఐ కాదన్నాడు. ఒకవేళ ప్రభుత్వం ఓకే చెప్పిన మరో రెండు మూడు నెలల వరకు ఎలాంటి క్రికెట్ కార్యకలపాలను నిర్వహించలేమని స్పష్టం చేశాడు.

‘భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. షోయబ్ అక్తర్ చెబితే జరగదు. ఇది ఇరుదేశాల ప్రభుత్వాలపై ఆదారపడి ఉంది. ఏ నిర్ణయమైనా వారే తీసుకోవాలి. ఈ సిరీస్‌పై భారత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే బీసీసీఐ పాక్‌తో ఆడాలా? వద్దా అనే నిర్ణయానికి రాగలదు.'అని మదన్‌ లాల్ స్పష్టం చేశాడు.

ప్రభుత్వం అనుమతిచ్చినా కష్టమే..

ప్రభుత్వం అనుమతిచ్చినా కష్టమే..

ఇక ప్రభుత్వం అనుమతిచ్చినా.. బీసీసీఐ ఒప్పుకున్నా ప్రస్తుత పరిస్థితిల్లో మరో రెండు, మూడు నెలల వరకు ఈ సిరీస్ నిర్వహించడం అసాధ్యమని ఈ వరల్డ్‌కప్ విన్నర్ చెప్పుకొచ్చాడు.

‘ప్రస్తుతం మనమంతా కరోనాతో పోరాడుతున్నాం. మరి కొన్ని నెలల వరకు ఏం చేయలేని పరిస్థితి. కరోనా వైరస్ తగ్గు ముఖం పడితే, పాకిస్థాన్‌తో సిరీస్‌పై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోగలదు. ఇక తుది నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.'అని మదన్ లాల్ తెలిపాడు.

అక్తర్ ప్రతిపాదన వింటే నవ్వొస్తుంది

అక్తర్ ప్రతిపాదన వింటే నవ్వొస్తుంది

అక్తర్ చేసిన ప్రతిపాదన హస్యాస్పదంగా ఉందని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపాడు. అక్తర్ సరదా మనిషని అతని మాటలు పెద్దగా పట్టించుకోనవసరం లేదన్నాడు. ఐపీఎల్ నిర్వహించేలేని స్థితిలో తాముంటే.. భారత్-పాక్ సిరీస్ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించాడు. కరోనా కారణంగా ఇరు దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయని, పాకిస్థాన్‌లో పరిస్థితి మరి అధ్వాన్నంగా ఉందని తెలిపాడు. ఈ నేపథ్యంలో అక్తర్ ప్రతిపాదించిన టోర్నీ ఎలా సాధ్యమవుతుందన్నాడు. కాబట్టి అతని వ్యాఖ్యలు సరదాగా చేసినవని తాను భావిస్తున్నాని చెప్పుకొచ్చాడు.

మాకు ఆ కర్మ పట్టలేదు..

మాకు ఆ కర్మ పట్టలేదు..

ఇలాంటి సిరీస్‌ల ద్వారా వచ్చే డబ్బు భారత్‌కు అవసరం లేదని వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్ల జీవితాలతో రిస్క్ చేయాల్సిన అవసరం లేదని చురకలంటించాడు. తమ దగ్గర చాలినంత డబ్బు ఉందని, ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు మా అధికారులందరూ కలిసి కట్టుగా పని చేస్తున్నారని తెలిపాడు. ఇప్పటికే బీసీసీఐ రూ.51 కోట్లు విరాళంగా ఇచ్చిందని, అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందన్నాడు.

Story first published: Friday, April 10, 2020, 13:41 [IST]
Other articles published on Apr 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X