న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

26, 30, 36, 45, 47: టెస్టు చరిత్రలో అత్య‌ల్ప స్కోర్లు!! ఏ జట్టు స్కోరు ఎంతో తెలుసా?

Lowest innings totals in Test cricket list, New Zealand on Top

హైదరాబాద్: 'క్రికెట్‌.. అంటేనే విచిత్రమైన ఆట. ఇందులో అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో ఎన్నో కొత్త రికార్డులు నమోదవుతుంటాయి. బ్యాట్స్‌మన్‌ తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేస్తే.. ఆ రికార్డు బ్రేక్ చేయడానికి ఎన్నో రోజులు పట్టట్లేదు. అలానే బౌలింగ్ విషయంలోనూ కొత్తకొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇక జట్టు విషయంలో కూడా పలు రికార్డులు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన గులాబి టెస్టులో భారత్‌ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. టెస్టు చ‌రిత్ర‌లో అత్య‌ల్ప స్కోరును నమోదుచేసింది. 36 పరుగులకే పరిమితమై చెత్తగా ఓడింది. ఇలాంటి పరిస్థితిని భారత్ మాత్రమే కాదు అన్ని జట్లూ ఎదుర్కొన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

న్యూజిలాండ్‌ 26

న్యూజిలాండ్‌ 26

444 టెస్టులాడిన న్యూజిలాండ్‌ జట్టు 103 గెలిచి 175 ఓడింది. ఇక 166 డ్రా చేసుకుంది. అయితే జట్టు అత్యల్ప స్కోరు 26. టెస్టు చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో ఓ జట్టు చేసిన తక్కువ స్కోరు ఇదే. 1955లో ఇంగ్లాండ్‌ చేతిలో ఈ పరాభవం ఎదురైంది. మొదట న్యూజిలాండ్‌ 200 చేయగా.. ఇంగ్లాండ్‌ 246 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బాబ్‌ ఆపిల్‌యార్డ్‌ 4/7, బ్రియన్‌ స్టాథమ్‌ 3/9, ఫ్రాంక్‌ టైసన్‌ 2/10 విజృంభించడంతో కివీస్‌ 26కే ఆలౌట్‌ అయింది. ఇన్నింగ్స్‌ 20 పరుగుల తేడాతో కివీస్ ఓడిపోయింది. ఇక 2013లో దక్షిణాఫ్రికా చేతిలో 45కే ఆలౌటైంది.

దక్షిణాఫ్రికా 30

దక్షిణాఫ్రికా 30

టెస్ట్ ఫార్మాట్లో దక్షిణాఫ్రికా వరుసగా నాలుగుసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసింది. 1896, 1924లో ఇంగ్లాండ్‌ చేతిలో వరుసగా 30కే ఆలౌటైంది. మళ్లీ అదే జట్టు చేతిలో 1899లో 35కు పరాభవం ఎదుర్కొంది. 1932లో ఆసీస్‌ చేతిలో 36కు కుప్పకూలింది. అయితే 20వ శతాబ్దం తర్వాత చేసిన అత్యల్ప స్కోరు 73. గాలె వేదికగా 2018లో శ్రీలంక మ్యాచులో 73 స్కోర్ చేసింది. 351 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో చేధనకు దిగిన సఫారీలను శ్రీలంక ఆటాడుకుంది. దిల్రువాన్‌ పెరీరా 6/32, రంగనా హెరాత్‌ 3/38 దెబ్బకు డీన్ ఎల్గర్‌, ఆశిం ఆమ్లా, ఫాఫ్ డుప్లెసిస్‌ వంటి టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు ఒక అంకె స్కోరుకు పరిమితం అయ్యారు. వెర్నాన్‌ ఫిలాండర్‌ చేసిన 22 పరుగులే అత్యధిక స్కోరు.

ఆస్ట్రేలియా 36

ఆస్ట్రేలియా 36

ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 831 టెస్టులాడి 393 గెలిచి 225 ఓడారు. 211 డ్రా చేసుకున్నారు. భారీ స్కోర్లకు చిరునామా అయిన ఆసీస్‌ అత్యల్ప స్కోరు 36. ఇంగ్లాండ్‌తో 1936లో తలపడ్డప్పుడు ఈ స్కోర్ నమోదయింది. ఇంగ్లాండ్‌ 376/9కు తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. విల్‌ఫ్రెడ్‌ రోడ్స్‌ 7/17 విజృంభణతో ఆసీస్‌ కుదేలైంది. 20వ శతాబ్దంలో దక్షిణాఫ్రికా చేతిలో రెండో ఇన్నింగ్స్‌లో 47 పరుగులకే ఆలౌటైంది. మొదట ఆసీస్‌ 284 చేసింది. ఆపై దక్షిణాఫ్రికా 96కే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో వెర్నాన్‌ ఫిలాండర్‌ 5/15, మోర్నీ మోర్కెల్‌ 3/9 చుక్కలు చూపించారు. నేథన్‌ లైయన్‌ (14)ది టాప్‌ స్కోరు.

భారత్‌ 36

భారత్‌ 36

అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌ 543 టెస్టులు ఆడి 157 గెలిచింది. 168 ఓడి.. 217 డ్రా చేసుకుంది. సుదీర్ఘ ఫార్మాట్లో భారత్ అత్యల్ప స్కోరు 36. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి గులాబి మ్యాచులో ఇది జరిగింది. మొదట కోహ్లీసేన 244కు ఆలౌటైంది. ఆసీస్‌ 191కు తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో జోస్‌ హేజిల్‌వుడ్‌ 5/8, పాట్‌ కమిన్స్‌ 4/21 టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టారు. అంతకుముందు భారత్ అత్యల్ప స్కోరు 42.

ఇంగ్లండ్ 45

ఇంగ్లండ్ 45

ఇంగ్లండ్ జట్టు ఇప్పటి వరకు 1028 మ్యాచులు ఆడింది. 373 గెలిచి.. 306 ఓడింది. ఇక 349 డ్రా చేసుకుంది. ఇంగ్లిష్‌ జట్టు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో చేసిన అత్యల్ప స్కోరు 45. ఆస్ట్రేలియాతో 1887లో ఆడింది. జార్జ్‌ లోహ్‌మన్‌ (17) తప్ప మిగతా అందరూ ఒక అంకె స్కోరుకే పరిమితం అయ్యారు. 20వ శతాబ్దలో 1994లో వెస్టిండీస్‌తో రెండో ఇన్నింగ్స్‌లో 46కే కుప్పకూలింది. సర్‌ ఆంబ్రోస్‌ 6/24, కోర్ట్నీ వాల్ష్‌ 3/16 నిప్పులు చెరిగారు. ఇంగ్లండ్‌లో అలెక్స్‌ స్టీవార్ట్‌ (18) తప్ప మరొకరు రెండంకెల స్కోరు చేయలేదు.

 వెస్టిండీస్ 47

వెస్టిండీస్ 47

వెస్టిండీస్‌కు 550 టెస్టుల అనుభవం ఉంది. 175 గెలిచి.. 199 ఓడింది. మరో 175 డ్రా చేసుకుంది. 1970వ దశకంలో వెస్టిండీస్‌ జట్టు పర్యటనకు వస్తోందంటే ఆతిథ్య దేశాలు వణికిపోయేవి. అలాంటి విండీస్ జట్టు చేసిన అత్యల్ప స్కోరు 47. కింగ్‌స్టన్‌ వేదికగా 2004లో ఇంగ్లాండ్‌తో తలపడ్డ టెస్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట విండీస్‌ 311 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ 339 చేసింది. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన విండీస్ జట్టును స్టీవ్‌ హార్మిసన్‌ 7/12, మాథ్యూ హొగ్గార్డ్‌ 2/21 ఆటాడుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ సునాయస విజయాన్ని అందుకుంది.

పాకిస్థాన్‌ 49

పాకిస్థాన్‌ 49

పాకిస్థాన్‌ ఇప్పటి వరకు 431 టెస్టులు ఆడి 138 గెలిచి.. 131 ఓడింది. 162 మ్యాచులు డ్రా చేసుకుంది. టెస్టుల్లో పాక్ అత్యల్ప స్కోరు 49. జోహన్స్‌బర్గ్‌ వేదికగా 2013లో దక్షిణాఫ్రికా చేతిలో దానికి భంగపాటు ఎదురైంది. మొదట సఫారీలు 253 పరుగులు చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 29.1 ఓవర్లకే 49కే కుప్పకూలింది. డేల్‌ స్టెయిన్‌ 6/8, ఫిలాండర్‌ 2/16, జాక్వెస్‌ కలిస్‌ 2/11 బెంబేలెత్తించారు. అజహర్‌ అలీ (13), మిస్బాఉల్‌ హఖ్‌ (12) మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు.

శ్రీలంక 71

శ్రీలంక 71

289 టెస్టులాడిన శ్రీలంక చేసిన స్వల్ప స్కోరు 71. క్యాండీ వేదికగా 1994లో పాక్‌తో జరిగిన పోరులో మొదటి ఇన్నింగ్స్‌లో 28.2 ఓవర్లకు కుప్పకూలింది. 2019లో ఇంగ్లండ్‌తో ఆఖరి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ 15.4 ఓవర్లకు 38 పరుగులే చేసింది. వందకు పైగా టెస్టులాడిన బంగ్లాదేశ్‌ అత్యల్ప స్కోరు 43. నార్త్‌సౌండ్‌ వేదికగా 2018లో వెస్టిండీస్‌‌తో జరిగిన మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో 18.4 ఓవర్లకే చాపచుట్టేసింది. ఇక జింబాబ్వే అత్యల్ప స్కోరు 51. నేపియర్‌ వేదికగా 2012లో న్యూజిలాండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 28.5 ఓవర్లకు ఆలౌటైంది.

'ఆస్ట్రేలియా పర్యటన చాలా నేర్పింది.. టెక్నికల్‌ విషయాలపైనే కాకుండా'

Story first published: Monday, December 21, 2020, 15:40 [IST]
Other articles published on Dec 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X