న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హర్భజన్‌ను చూసి 'లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌'గా అనిపించింది: గంగూలీ

Love At First Sight: Sourav Ganguly Recalls Harbhajan Singhs Eden Gardens Heroics

ముంబై: ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చూసి ఫిదా అయ్యా. ఆ సమయంలో హర్భజన్‌ను చూసి 'లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌'గా అనిపించింది అని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో గెలిచిన ఆ టెస్ట్ మ్యాచ్‌ భారత క్రికెట్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. వీవీఎస్‌ లక్ష్మణ్‌ (59, 281), హర్భజన్‌ సింగ్ (7/123, 6/73) విజయంలో కీలక పాత్ర పోషించారు.

<strong>వైరల్ ఫొటోలు.. మంచు పర్వతాలపై గర్ల్‌ఫ్రెండ్‌తో పంత్!!</strong>వైరల్ ఫొటోలు.. మంచు పర్వతాలపై గర్ల్‌ఫ్రెండ్‌తో పంత్!!

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌

అలనాటి మధురానుభూతులు గంగూలీ తాజాగా గుర్తుచేసుకున్నారు. 'లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌ అని అందరూ అంటారు. ఈడెన్‌లో 13 వికెట్లు తీసిన హర్భజన్‌ను చూస్తే అలాగే అనిపించింది. భజ్జీ బౌలింగ్‌ చూసి ఫిదా అయ్యా. భారత క్రికెట్‌లో అతడు మార్పు తెస్తాడని అప్పుడే నమ్మకం కలిగింది. ఆ తర్వాత అతను 700 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్‌ 700 వికెట్లు తీయడంతో ఆశ్చర్యపోలేదు' అని గంగూలీ అన్నారు.

వారు భారత క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యాలు

వారు భారత క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యాలు

'హర్భజన్‌, అనిల్‌ కుంబ్లే భారత క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యాలు. ఇద్దరూ అత్యత్తమ స్పిన్నర్లు. టెస్టు క్రికెట్‌లో తమ ముద్ర వేశారు. వారిద్దరు ప్రత్యర్థులను పెవిలియన్‌కు చేర్చుతూ.. టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియాతో 2001లో ఆడిన టెస్టు మ్యాచ్‌లో కుంబ్లే ఆడాల్సి ఉంది. అయితే జంబోకు గాయం కారణంగా భజ్జీ జట్టులోకి వచ్చాడు. జవగళ్‌ శ్రీనాథ్‌, కుంబ్లే ఇద్దరు ప్రధాన బౌలర్లు ఆ మ్యాచ్‌లో ఆడలేదు. భజ్జీ కొత్త ఆటగాడు' అని దాదా పేర్కొన్నారు.

ఛాంపియన్‌లా బౌలింగ్‌ చేశాడు

ఛాంపియన్‌లా బౌలింగ్‌ చేశాడు

'ఆసీస్‌ సిరీస్‌ ఆరంభానికి ముందు భజ్జీకి అంతగా అనుభవం లేదు. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లో భజ్జీని కొనసాగిస్తూ.. మరో స్పిన్నర్‌ను తీసుకున్నాం. తొలి మ్యాచ్‌లో రాహుల్‌ సంఘ్వి, రెండో టెస్టులో వెంకటపతి రాజు, చివరి మ్యాచ్‌లో కులకర్ణిని తీసుకున్నాం. కానీ.. వికెట్లు తీసింది మాత్రం భజ్జీనే. అతడు ఛాంపియన్‌లా బౌలింగ్‌ చేశాడు' అని గంగూలీ తెలిపారు.

భారత్ తరఫున 711 వికెట్లు

భారత్ తరఫున 711 వికెట్లు

'జట్టులోకి యువకులు వచ్చాక విజయాలపై నమ్మకం కలిగింది. మ్యాచ్‌ విన్నర్లపై విశ్వాసం ఉంచా. భయం లేకుండా దూకుడుగా ఆడే ఆటగాళ్లపై నమ్మకముంచా. మ్యాచ్‌లు గెలవడానికి అదొక్కటే మార్గమని తెలుసుకున్నా. ఎప్పుడూ కూడా మ్యాచ్‌లు డ్రా చేసుకోడానికి ఇష్టపడలేదు. జట్టు గెలుపొందడం లేదా ఓటమిపాలవ్వడం మాత్రమే నమ్ముకున్నా' అని దాదా చెప్పుకొచ్చారు. భారత్ తరఫున హర్భజన్‌ 711 వికెట్లు పడగొట్టాడు. 103 టెస్టుల్లో 417, 236 వన్డేల్లో 269, 28 టీ20ల్లో 25 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, January 3, 2020, 12:39 [IST]
Other articles published on Jan 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X