న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హనుమంతునికి కులం లేదు.. ఆయనొక స్పోర్ట్స్ ప్లేయర్: భారత మాజీ క్రికెటర్

Lord Hanuman was a sportsperson, his caste shouldn’t be discussed: Ex-Indian cricketer Chetan Chauhan

మెల్‌బోర్న్‌: పార్టీ ప్రచారాల కోసం ప్రజలు దేవుళ్లుగా పూజించే వారిని సైతం తమ కులాలు, మతాలకు ఆపాదించేస్తున్నారు. చత్తీస్‌ఘడ్ ఎన్నికల ప్రచారంలో యూపీ ముఖ్యమంత్రి హనుమంతుడు ఓ గిరిజనుడంటూ సంభోదించాడు. హనుమంతునిలా మనమంతా రాముడికి సేవ చేయాలి. రావణుడిలా కాంగ్రెస్‌కు ఓటెయ్యెద్దంటూ ప్రజలకు హితబోధ చేశాడు. ఇవి చాలదన్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ ఏకంగా హనుమాన్ మతమే మార్చేశాడు. హనుమాన్ దళితుడు కాదంటూ అభిప్రాయపడ్డాడు.

టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే పెర్త్ లాంటి పిచ్‌లు అవసరం: సచిన్ టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే పెర్త్ లాంటి పిచ్‌లు అవసరం: సచిన్

హనుమాన్ ముస్లిం అని ఆయన పేరునే దీనికి ఉదహరణ అంటూ చెప్పుకొచ్చాడు. ముస్లిం మతంలో పేర్లు ఉన్నట్లు సల్మాన్, రెహమాన్, ఉస్మాన్, వలె హనుమాన్ అనే పేరు కూడా ఉందంటూ ఆయన ముస్లిం మతానికి చెందిన వాడేనంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు వీటన్నింటికీ కౌంటర్‌గా హనుమాన్ ఓ స్పోర్ట్స్ పర్సన్ అంటూ భారత మాజీ క్రికెటర్ చేతన చౌహన్ వార్తల్లోకి ఎక్కాడు. అతని దయ వల్లనే చాలా మంది క్రీడాకారులు ఇంతగా రాణించగల్గుతున్నారని కొనియాడాడు.

' నేను భగవానుడు హనుమంతుని నమ్ముతాను. శత్రువులను తన రెజ్లింగ్ విద్యతో మట్టి కరిపించాడు. మన దేశంలోని వీరులంతా ఆయన నుంచి శక్తి పొంది మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను. ఆటగాళ్లకు కులంతో పనిలేదు. వీరులకు కులం అవసరమే లేదు. అమరత్వానికి దైవత్వానికి కులంకు సంబంధమే లేదు. హనుమంతుపై నమ్మకముంచుతాను. ఆయన దేవుడు. అలాంటిది ఏదో ఒక కులానికి ఆపాదించడాన్ని ముమ్మాటికి సహించను' అని మీడియా సమావేశంలో వ్యక్తపరిచారు.

కొద్ది రోజులుగా దేవుడి పేరును ఆపాదించుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్న రాజకీయ నాయకులందరికీ ఇది చెంపపెట్టులా అనిపించవచ్చు. ప్రజాసేవను చూపించి ఓట్లు అడగడానికి పోయి అమాయకులకు తెలియని చరిత్రను అబద్ధ రూపాల్లో చెప్తూ మోసానికి పాల్పడుతున్నారు. తామే అన్నీ అన్నట్లుగా చిత్రీకరించుకుని పదవులెక్కి ఏం సేవ చేయగలననుకుంటున్నారో..

Story first published: Monday, December 24, 2018, 12:34 [IST]
Other articles published on Dec 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X