న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాలా కాలం తర్వాత భారత్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తోంది: షోయబ్ అక్తర్

Long way before India becomes fast-bowling nation: Shoaib Akhtar

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన రెండు టెస్టుల్లో బ్యాట్స్‌మెన్‌లు పెద్దగా రాణించకపోయినా ఫేసర్‌లకు మాత్రం ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా వారి ఆట తీరును చూసి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అయిన షోయబ్ అక్తర్ పలు వ్యాఖ్యలు చేశాడు. ఇది భారత్‌కు ఆరంభం మాత్రమే. బౌలింగ్‌లో ఇంకా నైపుణ్యత పెంచుకోవాలని సూచించాడు.

చాలా కాలం తర్వాత మళ్లీ భారత్‌లో మంచి బౌలర్లను చూస్తున్నానన్నాడు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలు దక్షిణాఫ్రికా పర్యటనలో బాగా రాణిస్తున్నారని ప్రశంసించాడు. రెండు టెస్టులు ఓడిపోయినంత మాత్రాన భారత జట్టుకు ప్రతిభలేదని అనుకోకూడదని తెలిపాడు.

అసలు భారత్ అంటేనే బ్యాట్స్‌మెన్‌లకు పెట్టింది పేరు. అలాంటిది రెండు సంవత్సరాల నుంచి బౌలర్లు మెరుగ్గా ప్రదర్శిస్తున్నారని కితాబిచ్చాడు. కేవలం, ఇది విరాట్ కోహ్లీ నాయకత్వంలోనే కుదిరిందని అభిప్రాయపడ్డాడు. దురదృష్టవశాత్తు అజింకా రహానే జట్టులో ఆడలేకపోయాడు. అతను ఆడి ఉంటే వేరేలా ఉండదేమో అన్నాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో బౌలర్లు బాగానే రాణించినా అవసరమైన సమయాల్లో వికెట్లు తీయలేకపోయారని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఇక భారత బ్యాట్స్‌మెన్‌ గురించి చెప్పాల్సిన పనిలేదని, వారు ఘోరంగా విఫలమయ్యారని అక్తర్ పేర్కొన్నాడు.

తాను పాకిస్థాన్‌ జట్టుకు సలహాలిచ్చేందకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని అయితే కోచ్‌గా పనిచేయడం మాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. తన కుమారుడి ఎదుగుదలను చూసి ఆనందించాలని కోరుకుంటున్నట్టు అక్తర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

రోహిత్ శర్మలో ఇంజమామ్‌ను చూశా:
రోహిత్ శర్మ చాలా నైపుణ్యం కలవాడు. అతనిలో నేను ఇంజమామ్ ఉల్ హక్‌ను చూశాను. అతనిలో ప్రతిభను చక్కగా వాడితే మ్యాచ్ ఖచ్చితంగా గెలిచితీరుతుందని ఊహాగానం వ్యక్తం చేశాడు. కొద్ది రోజుల్లో మొదలు కాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ముందుగానే సిద్ధంగా ఉంటే మంచిదంటూ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ జట్టు కూడా స్టార్ ఆటగాళ్లున్నారంటూ గుర్తు చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 19, 2018, 19:33 [IST]
Other articles published on Jan 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X