బెంగుళూరును కొట్టిపడేసిన కోల్‌కత్తా, నాలుగు వికెట్ల తేడాతో శుభారంభం

Written By:
have chosen to bowl

హైదరాబాద్: ఐపీఎల్‌-11 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు(ఆర్సీబీ) శుభారంభాన్ని నమోదు చేయలేకపోయింది. ప్రత్యర్థి కోల్‌కతా జట్టు కోహ్లీ సేన నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా సాధించింది. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో కేకేఆర్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ సునాయాసంగా ఛేదించింది. కేకేఆర్‌ ఆటగాళ్లలో సునీల్‌ నరైన్‌(50) చెలరేగి ఆడగా, అందుకు నితీశ్‌ రానా(34), దినేశ్‌ కార్తీక్‌ ( 35 నాటౌట్‌)లు చక్కటి సహకారం అందించారు.

బెంగుళూరు వర్సెస్ కోల్‌కత్తా స్కోరు వివరాలు

బెంగుళూరు జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 176 స్కోరును సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం మరో రసవత్తర పోరు మొదలైంది. టోర్నీ మూడో మ్యాచ్‌లో త‌ల‌ప‌డేందుకు దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ సిద్ధమైయ్యాయి.

టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకొంది. అంతర్జాతీయ క్రికెట్లో హార్డ్‌హిట్టర్లు మెక్‌కలమ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్వింటన్ డికాక్‌లతో ఆర్‌సీబీ పటిష్ఠంగా ఉంది.

మరోవైపు క్రిస్‌లిన్, ఉతప్ప, దినేశ్ కార్తీక్, రస్సెల్‌తో కోల్‌కతా కూడా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. దీంతో అభిమానులకు మరో అసలైన మజా అందించేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. అభిమానులతో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కిక్కిరిసిపోయింది.

బెంగళూరు జట్టు: క్వింటన్ డీకాక్, బ్రెండన్ మెక్‌కలమ్, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, సర్ఫరాజ్ ఖాన్, మన్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ వోక్స్, కుల్వంత్ ఖేజ్రోలియా, ఉమేష్ యాదవ్, యజ్వేంద్ర చాహల్

కోల్‌కతా జట్టు: క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రానా, దినేష్ కార్తీక్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా, వినయ్ కుమార్, మిచెల్ జాన్సన్, కుల్డీప్ యాదవ్

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 8, 2018, 20:24 [IST]
Other articles published on Apr 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి