న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దాస్, తమీమ్‌ సెంచరీలు.. ఆమ్లా, డివిలియర్స్‌ పదేళ్ల రికార్డు బద్దలు!!

Liton Das, Tamim Iqbal record stand swamps Zimbabwe as Bangladesh sweep series

సిల్హెట్‌: ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్‌ వర్షం అంతరాయం కలిగించిన మూడో వన్డేలోనూ విజయం సాదించింది. ఓపెనర్లు లిటన్‌ దాస్‌ (143 బంతుల్లో 176; 16 ఫోర్లు, 8 సిక్సర్లు), తమీమ్‌ ఇక్బాల్‌ (128 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్సర్లు)లు సెంచరీలతో చెలరేగడంతో జింబాబ్వేతో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో బంగ్లా 123 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో) గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల్లోనూ పరుగుల వరద పారించిన బంగ్లా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

<strong>సిక్సర్లతో విరుచుకుపడిన రసెల్‌.. లంకపై ఘన విజయం.. వెస్టిండీస్‌దే టీ20 సిరీస్‌!!</strong>సిక్సర్లతో విరుచుకుపడిన రసెల్‌.. లంకపై ఘన విజయం.. వెస్టిండీస్‌దే టీ20 సిరీస్‌!!

దాస్, తమీమ్‌ సరికొత్త రికార్డు:

దాస్, తమీమ్‌ సరికొత్త రికార్డు:

మూడో వన్డేలో బంగ్లా ఓపెనర్లు లిటన్‌ దాస్‌, తమీమ్‌ ఇక్బాల్‌లు సరికొత్త రికార్డును నెలకొల్పారు. మూడు వన్డేల సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు.. రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డును బద్దలు కొట్టారు. తొలి వన్డేలో సెంచరీ చేసిన లిటన్‌ దాస్‌, రెండో వన్డేలో సెంచరీ చేసిన తమీమ్‌.. మూడో వన్డేలోనూ అదే పునరావృతం చేశారు. ఈ క్రమంలో పదేళ్ల రికార్డు బద్దలు కొట్టారు.

ఆమ్లా, డివిలియర్స్‌ పదేళ్ల రికార్డు బద్దలు:

ఆమ్లా, డివిలియర్స్‌ పదేళ్ల రికార్డు బద్దలు:

2010లో జింబాబ్వేపై దక్షిణాఫ్రికా ఓపెనర్లు హషీమ్‌ ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌ తలో రెండు సెంచరీలు చేసారు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత తమీమ్‌ ఇక్బాల్‌, లిటన్‌ దాస్‌ ఆ ఫీట్‌ సాధించారు. ఇక వన్డేల్లో బంగ్లా ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేయడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ క్రమంలోనే బంగ్లా ఓపెనర్ల అత్యధిక పార్ట్‌నర్‌షిప్‌ (292) రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. వన్డేల్లో బంగ్లాదేశ్‌కు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.

 లిటన్‌ దాస్‌ మరో రికార్డు:

లిటన్‌ దాస్‌ మరో రికార్డు:

ఈ సెంచరీతో లిటన్‌ దాస్‌ మరో రికార్డును కూడా నెలకొల్పాడు. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు (176) చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. రెండో వన్డేలో తమీమ్‌ ఇక్బాల్‌ 158 పరుగులు చేసి బంగ్లా తరపున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మూడో వన్డేలో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. మొన్నటివరకు ముష్ఫికర్‌ రహీమ్‌ చేసిన 144 పరుగులే అత్యధికం. ఇమ్రుల్ కాయెస్ (144), షకీబ్ అల్ హసన్ (132) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

సికందర్‌ రజా పోరాడినా:

సికందర్‌ రజా పోరాడినా:

మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. మ్యాచ్‌కు వర్షం అడ్డుపడటంతో ఇన్నింగ్స్‌ను 43 ఓవర్లకు కుదించారు. దాస్, తమీమ్‌ తొలి వికెట్‌కు 292 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభం అందించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం జింబాబ్వే లక్ష్యాన్ని 43 ఓవర్లలో 342 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 37.3 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. సికందర్‌ రజా (50 బంతుల్లో 61; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)పోరాడినా ఫలితం లేకపోయింది.

Story first published: Saturday, March 7, 2020, 12:17 [IST]
Other articles published on Mar 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X