న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండోసారి: కోహ్లీ మరో సూపర్‌మ్యాన్ క్యాచ్ చూశారా? (వీడియో)

By Nageshwara Rao
Lightning Does Strike Twice, Virat Kohli Takes Superman-like Catch Again

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో అత్యుత్తమ క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 11వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి ముంబై-బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ పట్టిన కోహ్లీ.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అలాంటి క్యాచ్ అందుకున్నాడు. ఈ రెండు క్యాచ్‌లు లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తూ అందుకున్నాడు.

కోహ్లీ సూపర్‌మ్యాన్ క్యాచ్

కోహ్లీ పట్టిన ఈ అద్భుత క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పకపోయినప్పటికీ, దూకుడుగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా వికెట్ కావడం విశేషం. ఆఖరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 25 పరుగులు అవసరమమైన సమయంలో తొలి బంతినే భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి పాండ్యా కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

14 పరుగుల తేడాతో బెంగళూరు విజయం

14 పరుగుల తేడాతో బెంగళూరు విజయం

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఫలితంగా సొంత మైదానంలో వరుసగా రెండు ఓటముల తర్వాత విజయంతో ఊపిరి పీల్చుకుంది.

లక్ష్య ఛేదినలో తడబాటుకు గురైన ముంబై

లక్ష్య ఛేదినలో తడబాటుకు గురైన ముంబై

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఆద్యంతం తడబాటకు లోనైంది. హార్దిక్‌ పాండ్యా(50), కృనాల్‌ పాండ్యా(23),జేపీ డుమినీ(23) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఫలితంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది.

7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసిన బెంగళూరు

7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసిన బెంగళూరు

బెంగళూరు బౌలర్లలో టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, సిరాజ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మనన్ వోహ్రా (45) చక్కటి ఆరంభం ఇవ్వగా... ఆ తర్వాత క్రీజులోకి దిగిన బ్రెండన్ మెక్‌కల్లమ్ (37) దూకుడుగా ఆడాడు.

కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు

కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు

కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించిన మెక్‌కల్లమ్‌ దూకుడుగా ఆడే క్రమంలో రనౌట్ వెనుదిరిగాడు. 121 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన బెంగళూరు జోరును పాండ్యా అడ్డుకున్నాడు. వరుస బంతుల్లో మన్‌దీప్(14), కోహ్లీ(32)లను పెవిలియన్‌కు చేర్చాడు. అదే ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్‌(1)ను కూడా పెవిలియన్ చేర్చాడు.

చివరి ఓవర్లో గ్రాండ్ హోమ్ రెండు సిక్సులు

చివరి ఓవర్లో గ్రాండ్ హోమ్ రెండు సిక్సులు

దీంతో ఒకే ఓవర్లో బెంగళూరు మూడు కీలక వికెట్లను కోల్పోయింది. చివరి ఓవర్లో గ్రాండ్ హోమ్(10 బంతుల్లో 23) రెండు సిక్సులు బాదడంతో బెంగళూరు గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. ముంబై బౌలర్లలో పాండ్యా మూడు వికెట్లు తీసుకోగా, మార్కెండే, బుమ్రా, మెక్లెన్‌గన్ తలో వికెట్ తీసుకున్నారు.

Story first published: Wednesday, May 2, 2018, 13:13 [IST]
Other articles published on May 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X