న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరీస్ గెలిచాం.. తదుపరి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాం

IND V WI 2019 : Virat Kohli Hints At Change In Team Combination For Final T20I After Sealing Series
West Indies vs India, 2nd T20I: Sealing the series gives the chance to bring few guys says Virat Kohli

లాడర్‌హిల్‌: ఇప్పటికే వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం. తదుపరి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే వీలు పెరిగింది. మా అంతిమ లక్ష్యం మాత్రం విజయం సాధించడమే అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ఆదివారం లాడర్‌హిల్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్‌ విజయం సాధించింది. విండీస్ చేధనలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 22 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. తాజా విజయంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

<strong>టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. రైనాను దాటినా కోహ్లీ</strong>టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. రైనాను దాటినా కోహ్లీ

మంచి పునాది వేశారు:

మంచి పునాది వేశారు:

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మరో మంచి గేమ్ ఆడాం. అందరూ సమిష్టిగా రాణించారు. ఉదయం పిచ్‌ను చూస్తే ముందుగా బ్యాటింగ్ చేయడమే మంచిదని అనుకున్నాం. మా బ్యాట్స్‌మెన్‌ మంచి పునాది వేశారు. వారి ఆటను చూస్తే 180 పరుగులు సాధిస్తాం అనిపించింది. అయితే పిచ్‌ స్లోగా ఉండడంతో తక్కువ స్కోర్ చేసాం. కృనాల్, జడేజా చివరలో విలువైన పరుగులు చేసారు' అని కోహ్లీ తెలిపాడు.

కొత్త బంతితో అద్భుతం చేశాడు:

కొత్త బంతితో అద్భుతం చేశాడు:

'ఈ మ్యాచ్‌ గెలవడం ద్వారా సిరీస్‌ సొంతమైంది. తదుపరి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే వీలు పెరిగింది. అయితే మా అంతిమ లక్ష్యం మాత్రం విజయం సాధించడమే. యువ బౌలర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కొత్త బంతితో అద్భుతం చేశాడు. అతని ప్రదర్శన అద్భుతం. బ్యాట్‌తో కూడా మెరవగలడు. సుందర్‌ మాకు కీలకం కానున్నాడు. టీ20 మ్యాచ్‌కు ఎల్లప్పుడు ఆదరణ ఉంటుంది. గయనాలో ఇదివరకు ఆడలేదు. మరో మ్యాచ్ కోసం జట్టు సభ్యులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

యాషెస్‌ తొలి టెస్టు: స్మిత్, వేడ్‌ సెంచరీలు.. ఇంగ్లండ్‌ లక్ష్యం 398

ప్రపంచ రికార్డు బద్దలు:

ప్రపంచ రికార్డు బద్దలు:

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (67; 51 బంతుల్లో 6×4, 3×6) అర్ధ సెంచరీ చేసాడు. మూడు సిక్సర్లు బాది టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ (107) రికార్డు సృష్టించాడు. విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌ (105) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు. ఈ సిరీస్‌కు ముందు రోహిత్‌ 102 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి టీ20లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్.. రెండో టీ20లో మూడు సిక్సర్లతో గేల్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో కివీస్ ఓపెనర్ మార్టిన్‌ గప్తిల్‌ (103) మూడో స్థానంలో ఉన్నాడు. టాప్ ముగ్గురు కూడా ఓపెనర్లే కావడం విశేషం.

Story first published: Monday, August 5, 2019, 12:04 [IST]
Other articles published on Aug 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X