న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదు వికెట్లతో కొత్త రికార్డు: కుల్దీప్‌పై కోహ్లీ ప్రశంసల వర్షం

By Nageshwara Rao
Lethal Kuldeep Yadav will play a big role for India: Virat Kohli

హైదరాబాద్: సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీసేన చక్కటి శుభారంభం చేసింది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో కేఎల్ రాహుల్ (101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన కుల్దీప్‌ 24 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో కుల్దీప్‌‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

1
42368

ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్(5/24) బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ పర్యటనలో తొలిసారి ఆడుతోన్న కుల్దీప్ యాదవ్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొనాలో తెలియక ఇంగ్లాండ్ టాపార్డర్ కుప్పకూలింది.

కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరిన జోస్ బట్లర్

కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరిన జోస్ బట్లర్

అందరి బౌలింగ్‌లోనూ స్వీప్, రివర్స్‌ స్వీప్‌లతో బౌండరీల మోత మోగించిన జోస్ బట్లర్.. కుల్దీప్ బౌలింగ్‌లో మాత్రం స్వీప్ షాట్ ఆడేందుకు కూడా సాహాసించలేదు. చివర్లో సిక్స్ కొట్టే ప్రయత్నంలో బంతి నేరుగా వెళ్లి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన కుల్దీప్ యాదవ్

టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన కుల్దీప్ యాదవ్

ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు దక్కించుకున్న కుల్దీప్‌ యాదవ్ టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అంతర్జాతీయ టీ20ల్లో ఐదు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. తొలి టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.

కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ కోహ్లీ ప్రశంసల వర్షం

కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ కోహ్లీ ప్రశంసల వర్షం

ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత్ ప్రధాన ఆయుధం కుల్దీప్ యాదవ్‌ అని కితాబిచ్చాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ "ఏ పిచ్‌పై ఆడినా కుల్దీప్ యాదవ్ సమర్థవంతంగా బౌలింగ్ చేస్తాడు. ఇక పిచ్‌ నుంచి కొంచెం టర్న్ లభిస్తే అతడి బౌలింగ్‌ మరింత పదునెక్కుతుంది. ఆ సమయంలో కుల్దీప్‌ బంతుల్ని బ్యాట్స్‌మెన్ ఎదుర్కోవడం చాలా కష్టం" అని అన్నాడు.

 ఈ పర్యటనలో అతనే భారత్ ప్రధాన ఆయుధం

ఈ పర్యటనలో అతనే భారత్ ప్రధాన ఆయుధం

"ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఆలోచనల్ని సులువుగా చదవగలడు. ఈ పర్యటనలో అతనే భారత్ ప్రధాన ఆయుధం. తొలి టీ20లోనే బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌ విభాగాల్లో జట్టు రాణించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా.. యువ ఆటగాళ్లు జట్టు బాధ్యతలు పంచుకోవడంతో ఆ ఆనందాన్ని రెట్టింపు అయింది" అని కోహ్లీ అన్నాడు.

Story first published: Wednesday, July 4, 2018, 15:04 [IST]
Other articles published on Jul 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X